`వైల్డ్ డాగ్`… ప్లాన్ బి ఉందా?

నాగార్జున న‌టించిన సినిమా `వైల్డ్ డాగ్‌`. పూర్తి స్థాయి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈసినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింద‌ని, సంక్రాంతికి ఇంట్లోనే ఈ సినిమా చూసేయొచ్చ‌ని అంటున్నారు. దాదాపుగా ఎగ్రిమెంట్ల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చేశాయి. అయితే నెట్ ఫ్లిక్స్ ద‌గ్గ‌ర ప్లాన్ బి కూడా ఉంద‌ట‌.

ముందు ఈ సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసి, మూడు రోజుల త‌ర‌వాత‌.. నెట్ ఫ్లిక్స్‌లోకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. సంక్రాంతి మంచి సీజ‌న్‌. ఈ సీజ‌న్‌లో వ‌సూళ్లు బాగుంటాయి. అందుకే క‌నీసం మ‌ల్టీప్లెక్స్ లో అయినా ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. ఆ బాధ్య‌త కూడా నెట్ ఫ్లిక్సే చూసుకోబోతోంద‌ట‌. థియేటరిక‌ల్ రిలీజ్ చేసే హ‌క్కు ఇప్పుడు నిర్మాత‌ల చేతుల్లో లేదు. అది ఓటీటీకి వెళ్లిపోయిన‌ట్టే. కావాలంటే థియేట‌ర్లోనూ విడుద‌ల చేసుకుంటారు. లేదంటే ఓటీటీతో స‌రిపెడ‌తారు. సినిమాపై న‌మ్మ‌కం ఉండి, థియేట‌ర్ల వ‌ర‌కూ జ‌నాలు వ‌స్తారు, చూస్తారు అనుకుంటే.. అటు ఓటీటీలోనూ, ఇటు వెండి తెర‌పైనా ఒకేసారి ఈ సినిమా చూడొచ్చు. సంక్రాంతికి థియేట‌ర్ల వ్య‌వ‌స్థ ఓ క్ర‌మ ప‌ద్ధ‌తిలోకి రాక‌పోతే.. నేరుగా ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close