అఫీషియ‌ల్‌: ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ ఎంట్రీ ఖాయం

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ అరంగేట్రం ఖాయమైంది. ఈ మేర‌కు.. కొద్దిసేప‌టి క్రితం ర‌జనీకాంత్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. 2021 ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. డిసెంబ‌రు 31న పార్టీ వివ‌రాలు ప్ర‌క‌టిస్తాన‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దాంతో.. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా, రారా? అనే సందిగ్థ‌త‌కు తెర ప‌డిన‌ట్టైంది. 2021 మేలో… త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ అడుగులు ఎటువైపు అనే ఆస‌క్తి నెల‌కొంది. ర‌జ‌నీకాంత్ కి రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని, ఆయ‌న మీటింగుల‌తో కాల‌క్షేపం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌కులు ఎద్దేవా చేసేవారు. ఇటీవ‌ల చెన్నైలో త‌న ఫ్యాన్స్ తో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు ర‌జ‌నీ. ఆ రోజే.. `త్వ‌ర‌లో నా నిర్ణ‌యం చెబుతా` అని ప్ర‌క‌టించారు. ఇప్పుడు.. అధికారికంగా జెండా ఎగ‌రేసేశారు. ర‌జ‌నీకాంత్ కి త‌మిళ‌నాట తిరుగులేని అభిమాన బ‌లం ఉంది. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తే స‌మీక‌ర‌ణాలు మార‌తాయ‌ని ఆయ‌న అభిమానుల న‌మ్మ‌కం. ఇంత‌కాలం.. వేచి చూసే ధోర‌ణిలో ఉన్న ర‌జ‌నీ.. ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగారు. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close