థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న బుజ్జిగాడు

రాజ్ త‌రుణ్ న‌టించిన చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. మాళ‌వికా నాయ‌ర్‌, హెబ్బా ప‌టేల్ క‌థానాయిక‌లు. కొండా విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థియేట‌ర్లు లేకపోవ‌డంతో ఓటీటీలో విడుద‌ల చేశారు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా ఇప్పుడు థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతోంది. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లోనూ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అందుకు ఏర్పాట్లూ మొద‌లెట్టింది. ఆహాలో ఎక్కువ మంది చూసిన సినిమాల్లో `ఒరేయ్ బుజ్జిగా` ఒక‌టి. థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తే.. మ‌రింత మందికి చేరువ అవుతుంన్న‌ది నిర్మాత‌ల న‌మ్మ‌కం. పైగా.. ఈరోజు నుంచి తెలంగాణలో థియేట‌ర్లు తెరిచారు. కానీ… ఆడించుకోవ‌డానికి ఏ సినిమా సిద్ధంగా లేదు. అందుకే ఓటీటీలో ఆడేసిన కొన్ని సినిమాల్ని ఇప్పుడు థియేట‌ర్ల‌లోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా `ఒరేయ్‌.. బుజ్జిగా` కూడా విడుద‌ల అవుతోంది. మ‌రి కొన్ని సినిమాలు ఒరేయ్ బుజ్జిగా బాట‌లో.. థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close