టీఆర్ఎస్‌కు ఎంఐఎం గండం..!

తెలంగాణ రాష్ట్ర సమితికి గ్రేటర్ ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బ కంటే.. ఇప్పుడు తమ ముందు ఉన్న సిట్యుయేషన్‌ను ఎలా డీల్ చేయాలన్నది పెద్ద పజిల్‌గా మారింది. మేయర్ సీటును టీఆర్ఎస్ వదులుకోలేదు. ఎందుకంటే… గ్రేటర్‌లో అత్యధిక సీట్లు ఉన్నఅతి పెద్ద పార్టీ. అలాగే ఎక్స్ ఆఫీషియో ఓట్ల బలం కూడా ఎక్కువగా ఉంది. కానీ… అన్నీ కలిపితే.. మ్యాజిక్ మార్క్ రాదు. ఎంఐఎం మద్దతు తీసుకోవావాల్సిందే. కానీ నేరుగా ఎంఐఎం పొత్తులు పెట్టుకుంటే.. పండుగ చేసుకునేది మొట్ట మొదట బీజేపీనే. 2023నాటికి వారు ప్రమామస్వీకారానికి ఏర్పాట్లను ఇప్పటి నుండే చేసుకుంటారు.

గ్రేటర్‌లో బీజేపీ అవలంభించిన రాజకీయ వ్యూహం చూసిన తర్వాత… ఎంఐఎంతో పొత్తు పెట్టుకునేంత సాహసం కేసీఆర్ చేయకపోవచ్చంటున్నారు. నేరుగా పొత్తు పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో.. బీజేపీ నేతలకు బాగా తెలుసు. అందుకే… ప్రచారానికి వచ్చినప్పుడు… హోంమంత్రి అమిత్ షా.. కేసీఆర్‌కు సవాల్ చేశారు. తెర వెనుక సహకారం ఎందుకు .. నేరుగా పొత్తులు పెట్టుకోవాలని చాలెంజ్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలదీ అదే డిమాండ్. ఇప్పుడు.. కేసీఆర్ ముందు ఈ చిక్కు ముడి అలాగే ఉంది. అలాగని భారతీయ జనతా పార్టీ మేయర్ సీటు పొందే అవకాశం లేదు. ఆ పార్టీకి ఉన్న యాభై సీట్లతో మేయర్ సీటు రాదు. ఎంఐఎంతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. అలాగే.. బీజేపీ, టీఆర్ఎస్ కూడా కలిసే అవకాశం లేదు. ఉన్న చాన్స్ ఒక్కటే.. అదే ఎంఐఎం, టీఆర్ఎస్ పొత్తులు పెట్టుకోవడం లేకపోతే పరోక్షంగా సహకరించుకోవడం.

మేయర్ సీటుపై టీఆర్ఎస్ కార్పొరేటర్ కూర్చునేలా.. నేరుగా పొత్తు పెట్టుకోకుండా ఎన్నిక సమయంలో ఎంఐఎం గైర్హాజర్ అవ్వొచ్చు. కానీ.. ఎంఐఎం ఎలాంటి ప్రతిఫలం లేకుండా అలాంటి పని చేయలేదు. పరోక్షంగా అయినారెండున్నరేళ్ల తర్వాత మేయర్ పదవికి ఆ పార్టీకి ఇవ్వాలంటే టీఆర్ఎస్ కూడా అలాంటి సహకరమే అందించాల్సి ఉంటుంది. కానీ నేరుగా పొత్తులు పెట్టుకోకపోయినా… ప్రజలు.. తమను మోసం చేస్తున్నారని భావిస్తే.. టీఆర్ఎస్ బేస్ కరిగిపోతుంది. అందుకే… అటు మేయర్ పీఠాన్ని వదులుకోలేరు.. ఇటు భవిష్యత్ ను పణంగా పెట్టలేరు. కేసీఆర్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close