ఏపీలో అంతే..! అనుకుంటే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు చివరికి రాజ్యాంగాన్ని మార్చేందుకు కూడా వెనుకాడని పరిస్థితిలోకి వచ్చేశారు. అనూహ్యంగా చివరి రోజు అసెంబ్లీలో చేసిన తీర్మానం దీనికి సాక్ష్యంగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే విషయంలో… ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితీసుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన తేదీల్లోనే పెట్టాలనేది ఆ తీర్మానం సారాంశం. ఆ తీర్మానం ఆధారంగా ఆర్డినెన్స్ జారీ చేసి.. ప్రస్తుతం ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో ఉన్నారు. అలాంటి ఆర్డినెన్స్ జారీ చేస్తే.. గవర్నర్ అగీకరిస్తారా..? లేదా ..? అన్నది తర్వాతి విషయం. అసలు రాజ్యాంగంలోని మౌలిక అంశాల్లో కూడా..ఇలా ఉల్లంఘన తీర్మానాలు చేయాలన్న ఆలోచన రావడమే ప్రభుత్వ పెద్దల ఆలోచనా తీరు ఎంత దారుణంగా ఉందో బయటపెట్టే సాక్ష్యం.

ఎన్నికల సంఘానికి… రాజ్యాంగంలో సంపూర్ణమైన స్వేచ్చ ఉంది. అది నేషనల్ కావొచ్చు.. స్టేట్ కావొచ్చు. నిష్పాక్షిపాతంగా.,. ప్రభుత్వాల ఒత్తిడి లేకుండా ఎన్నికలు నిర్వహించే స్వేచ్చే సీఈసీకి ఎస్‌ఈసీకి ఉంటుంది. దాన్ని ఆయన స్థానాల్లో కూర్చునే వ్యక్తులు ఎలా ఉపయోగించుకుంటారన్నదానిపై.. ఆ పవర్స్ శక్తి ఏమిటో బయటకు తెలుస్తుంది. ఒకప్పుడు శేషన్ అనే అధికారి ఉపయోగించుకున్న అధికారాలను చూస్తే.. సీఈసీ, ఎస్‌ఈసీ రాజ్యాంగబద్ధంగా ఎంత పవర్ ఫుల్లో అర్థమవుతుంది. ఆయన హయంలో జరిగిన ఎన్నికలు అత్యంత నిష్పక్షపాతమైనవిగా పేరు పొందాయి. ఆ తర్వాత ప్రభుత్వాల జోక్యం పెరిగిపోయింది. ఇప్పుడు అది మరో స్టేజ్‌కు వెళ్తోంది.

సీఈసీలు.. ఎస్‌ఈసీలు మాట వినకపోతే.. వారి పదవుల్ని తీసేస్తామన్నట్లుగా రాజకీయ పెద్దలు గేమ్ ఆడుతున్నారు. ఏపీలో జరిగిన పరిణామాలు చూస్తే.. ఎన్నికల కమిషన్ ను అంతతేలిగ్గా తీసేయవచ్చా.. అన్న చర్చ కూడా నడిచింది. చివరికి కోర్టులు వ్యవస్థను కాపాడినా.. ఇప్పటికీ.. ఆ వ్యవస్థపై ప్రభుత్వం దాడి చేస్తూనే ఉంది. దానికి నిన్న అసెంబ్లీలో చేసిన తీర్మానమే ఉదాహరణ. ఒక వేళ.. ప్రభుత్వ తీర్మానం ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసి.. దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే.. భారత ప్రజాస్వామ్య పునాదులకు మరో చీలిక వచ్చినట్లే్. రేపు కేంద్రం కూడా… అలాంటి ఆర్డినెన్స్ తీసుకు వచ్చి.. కావాల్సింత కాలం ఎన్నికల్ని వాయిదా వేసుకుంటుంది. అంటే రాజ్యాంగానికి రక్షణ లేనట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close