పేరు బీసీలది.. అధికారం రెడ్లది..! ఏపీలో “సామాజిక అన్యాయం”..!

పేరు బీసీలది.. అధికారం రెడ్లది..! ఏపీలో “సామాజిక అన్యాయం”..!

ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు మంచి చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తూ.. సంక్రాంతి పండుగలను కూడా నిర్వహించేస్తున్న ప్రభుత్వం అసలు నిజంగా చేస్తున్న మంచి ఎంత..? ఇస్తున్న నిధులెంత..? ఇచ్చిన పదవులెన్ని..? ఆయా వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకు రావడానికి చేస్తున్న కృషి ఎంత..? . బీసీలను ఉద్దరించేస్తున్నారని.. అధికార పార్టీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారహోరులో.. అసలు విషయం బయటకు రాకుండా పోతోంది. కానీ పదవులు.. నిధుల విషయంలో బీసీలకు ఎన్నడూ జరగనంత అన్యాయం ప్రస్తుతం జరుగుతోంది. అన్ని పదవులను ఒకే వర్గానికి కట్ట బెడుతూ.. విధులు, నిధులు లేని కార్పొరేషన్లను సృష్టించి.. పదవులు ఇచ్చినట్లుగా గొప్పగా ప్రకటిస్తోంది.

బీసీల రాజ్యాధికారాన్ని లాగేసుకున్న రెడ్లు..!

బీసీల రాజ్యాధికారాన్ని లాగేసుకుని కొత్త ప్రభుత్వం రెడ్ల చేతిలో పెట్టింది. దానికి రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. గతంలో బీసీ చైర్మన్‌గా ఉన్న టీటీడీ బోర్డును తీసుకుంటే అందులో ప్రస్తుతం 36 మంది సభ్యులు ఉంటే.. బీసీలు ముగ్గురంటే ముగ్గురు, కానీ రెడ్లు మాత్రం 11 మంది. పుట్టా సుధాకర్ యాదవ్ ని చైర్మన్ గా తొలగించి వైవీ సుబ్బారెడ్డికి పదవి అప్పగించారు. యూనివర్శిటీల వీసీ సభ్యులును 116 మందిని నియమిస్తే అందులో బీసీలు నలుగురంటే నలుగురేనని ఊహించగలమా..? కానీ రెడ్ల సంఖ్య మాత్రం 32. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విప్లవంలాగా నియామకాలు చేపట్టారు. సలహాదారుల దగ్గర్నుంచి వైస్ చాన్సలర్ల వరకూ ఈ నియామకాలు చేపట్టారు. నిజానికి ఈ పోస్టుల్లో గతంలో కూడా ఉన్నారు. కాంట్రాక్టుల్లో రివర్స్ కాంట్రాక్టులు చేపట్టినట్లుగా తాము అధికారంలోకి రాగానే ఇలాంటి నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారందర్నీ తొలగించేసి.. కొత్త వారిని నియమించిన కొత్త ప్రభుత్వం. ఇందులో రెడ్డి వర్గానికి సామాజిక న్యాయంచేసింది. పదవుల్లో ఉన్న బీసీలందర్నీ తొలగించి.. దారుణమైన అన్యాయం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అనేక కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో బీసీలు ఉండేవారు. టీటీడీ చైర్మన్ పదవి దగ్గర్నుంచి వైస్ చాన్సలర్ల వరకూ… బీసీలే ఎక్కువగా ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ పోస్టులన్నింటిలో రెడ్లు కనిపిస్తున్నారు. మెజార్టీ యూనివర్శిటీలకు వైస్ చాన్సలర్ల నియామకంలో రెడ్లకే ప్రాధాన్యం ఇవ్వడం వరకూ బీసీలపై పగబట్టినట్లుగా వ్యవహారాలు నడిచాయి. నిధులు, విధులు, అధికారం ఉండే నామినెటేడ్ పోస్టుల్లో 1700 మంది రెడ్లను నియమించారు. సలహాదారులను చూసినా.. కొత్తగా ఏర్పాటు చేసే కమటీల్ని చూసినా.. ఇలా ఎక్కడ చూసినా రెడ్ల మయమే అయింది.

బీసీల నిధులన్నీ పథకాలకు మళ్లింపు..!

రాష్ట్ర జనాభాలో సగం మంది బీసీలు ఉంటారు. వారికి నిధుల కేటాయింపులోనూ తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. అందరికీ ఇచ్చే ప్రభుత్వ పథకాల సొమ్మును బీసీలకే ఇస్తున్నట్లుగా ప్రచారం చేస్తూ.. మోసం చేస్తున్నారు. వాస్తవానికి బీసీలకు ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్కటంటే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ.. వారి నిధులు మాత్రం.. పథకాలకు వేల కోట్లు మళ్లించారు. 2020లో సంక్షేమ పథకాల కోసం బీసీలకు కేటాయించాల్సిన సొమ్ము దాదాపుగా రూ. పదకొండు వేల కోట్లను దారి మళ్లించారు. గత ఏడాది అమ్మఒడి పథకం కోసం.. బీసీ కార్పొరేషన్‌ నిధులు రూ. 3432 కోట్లు మళ్లిస్తూ ఒకే జీవో జారీ చేశారు. కాపుల కోసం కేటాయించిన నిధుల్ని కూడా మళ్లించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ల ద్వారా.. .ఆయావర్గాలకు అందే సాయం పూర్తిగా ఆగిపోయింది. రుణాలు అందడం లేదు. వారికి స్వయం ఉపాధి దక్కడం లేదు. దీంతో ఆయా వర్గాల్లో యువత నిరాశలో కూరుకుపోతోంది.

బీసీలకు సామాజిక అన్యాయం చేసిన వైసీపీ సర్కార్..!

బీసీలకు అటు పదవుల్లోనూ ఇటు నిధుల్లోనూ తీవ్ర అన్యాయం చేస్తున్న ప్రభుత్వం.. ప్రచారంలో మాత్రం వారికి చాలా మేలు చేస్తున్నట్లుగా కనిపించడానికి.. భారీగా ఖర్చు చేస్తోంది. బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. చైర్మన్లను.. సభ్యులను నియమించారు. వారికి పదో పరకో జీతం నిర్ణయించారు. కానీ వారికి నిధులు విధులు ఉండవు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కులాల వారీగా విడదీసి.. ఆయా కులాలకు ఇస్తున్న లబ్దిని కార్పొరేషన్ ఖాతాలో వేసి లెక్కలు చూపిస్తారు. అదే సాయం చేసినట్లుగా ప్రకటిస్తారు. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడానికే కార్పొరేషన్లు అని సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. దీంతో నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకోవద్దని నేరుగా చెప్పినట్లయింది.

బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదని.. బ్యాక్ బోన్ అని కబుర్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లలను బీసీ ఖాతాలో చేర్చేసుకుని వారికే అన్ని పదవులు ఇస్తూ.. బీసీలకే పట్టం కడుతున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది. బీసీ నేతలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. బీసీలు ఆర్థికంగా.., సామజికంగా.. రాజకీయంగా మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుందని.. ఆయా వర్గాల ప్రముఖులు ఆందోళనలో ఉన్నారు. తిరుగుబాటు చేసి.. ప్రాధాన్యం దక్కించుకోకపోతే… బానిసలుగా మార్చేస్తారన్న అభిప్రాయం వారిలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్…ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాండ్ కు సంబంధించి వివాదం తలెత్తడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం తలెత్తింది. 2003లో గీత లక్ష్మీ అనే...

సరైన ఏర్పాట్లు ఉంటే ఏపీలో 90 శాతం పోలింగ్ !

దేశంలో అత్యధిక రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 82 శాతం వరకూ పోలింగ్ నమోదయింది. అంతా పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటాన్ని గొప్పగా చెబుతున్నారు. కానీ పోలింగ్ పర్సంటేజీ...

ఇసుక మాఫియాకు సుప్రీంకోర్టు లెక్కే కాదు !

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు మాఫియా మాత్రం అబ్బే ఇసుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close