తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళే గేమ్ ఛేంజర్..!

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఈ నెలాఖరులో జైలు నుంచి విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె కోర్టు విధించిన ఫైన్ కట్టేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. జైలు శిక్ష అనుభవించిన కారణంగా శశికళ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అయితే రాజకీయం చేయడానికి మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవు. పవర్ ఫుల్ ఉమెన్‌గా ఆమె అన్నాడీఎంకేను చేజిక్కించుకున్నా.. ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. అన్నాడీఎంకేను జయలలిత ఉన్నప్పుడు కూడా శశికళ.. తెరవెనుక అన్నీ తానై నడిపించారు.

ఇప్పుడు శశికళ తమిళనాడులో అడుగు పెట్టిన వెంటనే పార్టీ శ్రేణులన్నీ ఆమెకు జై కొట్టే ఛాన్సుంది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఆమె పక్షం వహిస్తారా.. లేక శశికళ వేరు కుంపటి పెట్టుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. పన్నీర్ ను దించేసి తాను సీఎం కావాలనుకున్నప్పుడు… పరిస్థితులు అనుకూలించకపోవడంతో… రిసార్టుల్లో ఎమ్మెల్యేలను పెట్టి మరీ.. పళనీని సీఎం చేయడంలో శశికళ వర్గం ఎంతో కష్టపడింది. అయితే తర్వాత పళని పదవి కాపాడుకోవడానికి బీజేపీతో చేతులు కలిపి.. శశికళ వర్గాన్ని తొక్కేశారు.

అయితే.. అసలు శశికళ జైలు నుంచి విడుదల కావడం వెనుక బీజేపీ ఉందని.. శశికళతో బీజేపీ పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపించే వీలుందని చెబుతున్నారు. బీజేపీ, శశికళ పొత్తు కుదిరితే.. మిగతా పార్టీలకు ఇబ్బందేనని చెబుతున్నారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహాలను అంచనా వేయడం కష్టం. బీజేపీ ప్రతిపాదనలకు మొదట్లో అంగీకరించని కారణంగానే ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిందనేది తమిళనాడులో ఉన్న ప్రచారం. బీజేపీ సహకారం లేకపోతే.. ఆమె విడుదల సాధ్యం కాదని కూడా నమ్ముతున్నారు. ఇప్పటికీ కొన్ని కేసులు ఆమెపై పెండింగ్‌లో ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close