ఎన్టీఆర్ వర్థంతి : ధృవతార అంతర్థానమై పాతికేళ్లు..!

పాతికేళ్ల క్రితం ఇదే రోజు.. జనవరి పద్దెనిమిదో తేదీన ప్రపంచంలోని తెలుగు వారందరూ షాక్‌కు గురయ్యారు. ఎన్టీఆర్ మహాభినిష్క్రమణం వార్త తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఆయన కడ చూపు కోసం అశేష జనం హైదరాబాద్ తరలి వచ్చింది. రాష్ట్రంలో జనం ఎక్కడికక్కడ నివాళి అర్పించారు. మహనీయుడా మళ్లీ పుట్టు అని కోరుకున్నారు. ఓ ధృవతార అంతర్థానమైన పాతికేళ్లు గడుస్తున్నా.. ప్రజల మనసుల్లో ఎప్పటికప్పుడు వెలుగులు పెంచుకుంటూపోతున్నారు. మరపు రాని వ్యక్తిగా మదిలో ఉండిపోతున్నారు.

వెండితెరపై దైవస్వరూపం..!

కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి రైతుబిడ్డగా పయనం సాగించి.. సినీ, రాజకీయ రంగాల్లో .. చెరగని సంతకంగా మారిన మహామనిషి ఎన్టీఆర్. సినిమాల్లో తన ముద్ర ఎంత బలంగా వేశారో.. రాజకీయాల్లోనూ అలాగే మేరునగధీరుడిగా ఎదిగారు. ప్రపంచ సినీ చరిత్రలోనే దేనికవే భిన్నమైన పాత్రలను పోషించిన మహానటుడు మరె క్కడా కనిపించరు. దైవత్వానికి రూపం ఇస్తే ఇలా వుంటుందనిపించేలా వెలిగిన నిండైన విగ్రహం ఎన్టీఆర్‌. ఆయన రావణబ్రహ్మలాంటి పాత్రలు కూడా చేశారు. వాల్మీకి, వ్యాస మహర్షులు రచించిన కావ్యాలలోని రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ళకు సజీవ రూపం రామారావు. చిన్న రంగస్థల నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వామనావతారం ఎన్టీఆర్‌.

రాజకీయతెరపై బలహీనవర్గాలకు అధికార ప్రదాత..!

సినిమాల్లో సాధించాల్సినదంతా సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అంటూ తెలుగు రాజకీయ రంగంలో తనదైన ముద్రవేసిన ప్రజానేత నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలతో అన్న అని పిలిపించుకున్న అజరామరుడు. నాలుగున్నర దశాబ్దాలపాటు వెండితెర వేలుపుగా, సాంఘిక, పౌరాణిక పాత్రల్లో ఆబాల గోపాలాన్ని అలరించిన మహానటుడు. తెలుగుజాతి గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి.

పేదలకు ఆత్మగౌరవ జీవితాన్నిచ్చిన పాలకుడు..!

తెలుగు సాహిత్యంపై అపారమైన పట్టున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ . ఆయన నటించిన సినిమాలన్నిటా తెలుగువారి జీవితం, సంప్రదాయం నిండుగా వుంటాయి. జీవితంలోని తాత్వికత కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీవీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్‌. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్‌ వ్యవస్థలను రద్దుచేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేశారు. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా గాక సాంఘిక విప్లవ సాధనంగా తీర్చిదిద్దారు. ఆద్యంతం పేదల పెన్నిధిగా జీవించారు.

కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం ఎన్.టి.ఆర్..!

రాజకీయాల్లో ఉన్న వారెవరైనా బుద్ధి పూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్ధుల ఎత్తుగడలను చిత్తుచేయడం, సొంత ఇమేజ్ పెంచుకోవడం, వంటి రాజకీయాలు ఆ నిర్ణయాల వెనుక వుంటాయి. అందుకు భిన్నంగా, హృదయ స్పందనలకు అనుగుణంగా, ప్రజలను ఓట్లుగా కాక ప్రజలుగానే చూడగల నాయకులు ఎన్ టి ఆర్. ఆయన తరువాత లేరు ఇకపై వస్తారన్న ఆశకూడా లేదు. కరిగిపోయే కాలంలో చెదరని జ్ఞాపకం ఎన్ టి ఆర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close