“ఆర్నాబ్‌”కు సైనిక రహస్యాలూ లీక్..! దేశభక్తి ఉందా..?

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్, రేటింగ్‌లు ఇచ్చే బార్క్ సంస్థకు చీఫ్‌గా పని చేసిన పార్థోదాస్ గుప్తా మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్ర పోలీసులు ఈ విషయంపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఆర్నాబ్ నిందితుడిగా ఉన్నారు. ఈ సమయంలో.. ఆయన చానల్ రేటింగ్స్‌ను మార్చడానికి… పార్ధోదాస్ గుప్తాతో డీల్ మాట్లాడుకున్నారు. నిజమైన రేటింగ్స్ కాకుండా.. ఆర్నాబ్ చెప్పినట్లుగా టీవీ చానళ్ల రేటింగ్‌లు మార్చేవారు. ఈ క్రమంలో.. ఆర్నాబ్‌కు.. పార్ధోదాస్ గుప్తాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌లు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. దీనికి కారణం… కేవలం టీవీ రేటింగ్‌ల గురించే అందులో లేదు.. కీలకమైన రక్షణ శాఖ అంశాలు కూడా ఆర్నాబ్‌కు ముందే తెలిశాయని.. వాటిని ఆనయ పార్ధోదాస్ గుప్తాతో పంచుకున్నారని స్పష్టమవడమే అసలు సంచలనం.

బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ను సైన్యం చేస్తున్న విషయం మూడు రోజుల ముందుగానే ఆర్నాబ్ గోస్వామికి తెలిసింది. ఈ విషయాన్ని ఆయన పార్ధోదాస్ గుప్తాకు కూడా చెప్పారు. అత్యంత కీలకమైన రక్షణ శాఖ.. దేశానికి సంబందించిన కీలకమైన సమాచారం.. ఆర్నాబ్‌కు ఎలా తెలిసిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేతలందరూ ఇదే అంశాన్ని ప్రశ్నిస్తుస్తున్నారు. దేశ రహస్యాలను లీక్ చేసిన వారెవరో బయట పెట్టాలని అంటున్నారు. ఈ వాట్సాప్ చాట్‌లు బయటకు వచ్చిన తర్వాత పార్దోదాస్ గుప్తా.. ఆస్పత్రిలో ఐసీయూలో చేరిపోయారు. ఆయన తన అనారోగ్యానికి సంబంధించిన మందులు వేసుకోకపోవడం వల్ల చిన్న సమస్య వచ్చిందని… బాగానే ఉన్నారని చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో చేరిన సమయమే కాస్త తేడాగా ఉంది.

అదే సమయంలో న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కూడా.. ఈ వాట్సాప్ చాట్‌లపై స‌్పందించింది. బార్క్ ను రేటింగ్స్ ను నిలిపివేయాలని కోరింది. నిజానిజాలన్నీ బయటపడిన తర్వాతనే… రేటింగ్‌లు ఇవ్వాలని తేల్చేసింది. వాట్సాప్‌ చాట్‌లో ఉన్న వివరాలన్నీ బహిర్గతం కావడంతో… ఇప్పుడుదేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మీడియా మానిపులేషన్‌తో దేశం అభిప్రాయాన్ని మార్చడానికి వారి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ఎంతకైనా దిగజారిపోయే పరిస్థితి రావడం సామాన్యులను సైతం నిశ్చేష్టుల్ని చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close