“మైహోమ్” రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌పై కేంద్రం విచారణ..!

హైదరాబాద్ శివారులో మైహోమ్ గ్రూప్ చేపట్టిన ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి భారీ భవనాలు నిర్మిస్తున్నారని అందిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించింది. నార్సింగి దగ్గర నాలాలను ఆక్రమించి భారీ నిర్మాణాలు చేశారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. జీవో 111 సహా భవన నిర్మాణాల నిబంధనలు 2012కు విరుద్ధంగా 30 అంతస్తుల భవనాలు నిర్మించారని అందులో సాక్ష్యాలు పొందు పరిచారు. ఈ ప్రాజెక్టును మొదట డీఎల్ఎఫ్ మొదలు పెట్టింది. తర్వాత మైహోమ్ చేతికి వచ్చింది. రేవంత్ పిటిషన్‌పై చెన్నై ఎన్జీటీ.. తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సర్కారును ఆదేశించింది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం అధికారులు లైట్ తీసుకున్నారు. ఎలాంటి విచారణ చేయలేదు. నివేదిక ఇవ్వలేదు.

ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చెన్నై ఎన్జీటీకి ప్రత్యేకంగా అఫిడవిట్ ద్వారా తెలిపింది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో కూడిన జాయింట్ కమిటీ విచారణకు కూడా ఎన్జీటీ ఆదేశించింది. దాన్ని కూడా చేపట్టలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. కేంద్ర పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ… మైహోమ్ ప్రాజెక్టును అనుమతులను పరిశీలించాలని నిర్ణయించింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. మైహోమ్ గ్రూప్ తెలంగాణలో ఎంత శక్తివంతమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలి కాలంలో మీడియానూ గుప్పిట పట్టేశారు. ప్రభుత్వ పెద్దలకు మైహోమ్ గ్రూప్ పెద్దలు ఎంత చెబితే అంత అని.. రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఆరోపణలు చేస్తూ ఉంటారు.

మైహోమ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా లేదని తేలిపోయింది. అయితే ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి కేంద్రం రెడీగా లేదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యారవణ ఉల్లంఘనలు తేల్చేందుకు నేరుగా రంగంలోకి దిగింది. ఆ ప్రాజెక్టు నిజంగానే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిందని… రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ ఉంది. జీవో నెంబర్ 111కింద కఠినమైన నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనల ప్రకారం చూస్తే.. ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ విషయంలో మైహోమ్ చాలా తప్పిదాలు చేసినట్లే. కొన్ని వందల కోట్ల జరిమానా పడే ప్రమాదం ఉంది.

ఇప్పటికే ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఫ్లాట్లన్నింటినీ అమ్మేసుకున్నారు. ఒక వేళ.. ఈ ప్రాజెక్టు వివాదంలో పడితే.. మైహోమ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అనేక రకమైన కేసులు ఎదురవుతాయి. అటు పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కేసులతో పాటు ఇటు కొనుగోలు దారులు కూడా న్యాయం కోసం కోర్టుకెక్కే అవకాశం ఉంది. అదే సమయంలో తెలంగాణ సర్కార్‌కూ చిక్కులు వస్తాయి. అందుకే… తెలంగాణ అధికారులు సైలెంట్‌గా ఉన్నారు. కానీ కేంద్రం మాత్రం వదిలి పెట్టే ఉద్దేశంలో లేదని తాజా విచారణతో తేలిపోతుందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close