‘పుష్ష‌’.. ఐటెమ్ రెడీ అయిపోయింది: దేవిశ్రీ‌

సుకుమార్ – దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ అంటే… క‌చ్చితంగా పాట‌లు అదిరిపోతాయి. వీళ్ల నుంచి.. ఎప్పుడూ సూప‌ర్ హిట్ ఆల్బ‌మే వ‌చ్చింది. ఎందుకో సుకుమార్ అంటే.. దేవిశ్రీ రెచ్చిపోతాడు. దాంతో పాటు ఐటెమ్ గీతం మ‌స్టు. ఆర్య‌, ఆర్య‌2, జ‌గ‌డం, 100 % ల‌వ్‌, రంగ‌స్థ‌లం… ఈ ఆల్బ‌మ్స్ లో ఐటెమ్ గీతానికే పెద్ద పీట‌. ఆయా పాట‌లు ట్రెండ్ సృష్టించాయి. `పుష్ష‌`లోనూ ఓ ఐటెమ్ గీతం ఉంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు దేవీశ్రీ ప్ర‌సాద్ కూడా డిక్లేర్ చేసేశాడు. అంతేకాదు.. ఈ ఐటెమ్ గీతం కూడా రెడీ అయిపోయింద‌ని చెప్పేశాడు. “ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉంది. అది ఎప్పుడో సిద్ధ‌మైపోయింది కూడా. క‌చ్చితంగా ఓ రేంజ్‌లో ఉంటుంది“ అని అభిమానుల్ని ఊరించ‌డం మొద‌లెట్టాడు దేవిశ్రీ‌.

నిజానికి.. పుష్ష మ్యూజిక్ సిట్టింగ్స్ లాక్ డౌన్‌లోనే మొద‌లైపోయాయి. అల్లు అర్జున్ తో సినిమా ఖ‌రారు చేసుకున్నాక‌.. ముందు చేసిన ప‌ని.. దేవిశ్రీ ద‌గ్గ‌ర ట్యూన్లు రాబ‌ట్టుకోవ‌డం. అందులో భాగంగా తొలి పాట‌గా… ఐటెమ్ గీత‌మే చేసిచ్చాడ‌ట దేవిశ్రీ ప్ర‌సాద్‌. త్వ‌ర‌లోనే.. ఈ పాట‌ని హైద‌రాబాద్ లో చిత్రీక‌రించ‌బోతున్నార‌ని స‌మాచారం. మ‌రి ఈసారి.. దేవిశ్రీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close