బ్యాచిల‌ర్‌… ముందుకా? వెన‌క్కా?

అఖిల్ – బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`. పూజా హెగ్డే క‌థానాయిక‌. ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ – మ‌నుగ‌డ కోసం త‌పిస్తున్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబోలో సినిమా అంటే… పెద్ద‌గా ట్రేడ్ వ‌ర్గాలు ఆస‌క్తి చూపించ‌క‌పోవొచ్చు. కాక‌పోతే… ఆ టైటిల్‌, పూజా గ్లామ‌ర్‌, జీఏ 2 లాంటి బ్యాన‌ర్‌.. ఈసినిమాపై హోప్స్ మిగిల్చాయి.

మే 28న ఈ సినిమాని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అయితే… ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యిపోయింది. కేవ‌లం ఒకే ఒక్క రోజు.. షూటింగ్ బాకీ ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా.. ఓ వైపు జ‌రిగిపోతున్నాయి. మార్చి నాటికి.. ఫ‌స్ట్ కాపీ రెడీ అయిపోతుంది. అలాంట‌ప్పుడు మే వ‌ర‌కూ ఆగ‌డం ఎందుకు? అని చిత్ర‌బృందం ఇప్పుడు మ‌రోసారి ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు టాక్‌. పైగా.. మేలో.. చిరు, వెంకీ, బాల‌య్య సినిమాలు వ‌స్తున్నాయి. ఒక రోజు వ్య‌వ‌ధిలో ఆచార్య‌, నార‌ప్ప విడుద‌ల అవుతున్నాయి. మ‌రుస‌టి వారంలో.. బాల‌య్య సినిమా వ‌స్తోంది. ఆ వెంట‌నే… బ్యాచిల‌ర్ రావాలి. పెద్ద సినిమాల ప్ర‌భావం క‌చ్చితంగా బ్యాచిల‌ర్‌పై ఉంటుంది. పైగా మార్చిలో సినిమా పూర్త‌యితే.. మే వ‌ర‌కూ సినిమాని ఆపాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే… కాస్త ముందుకే తెచ్చే అవ‌కాశాలున్నాయి. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ అయితే.. ఏప్రిల్ లో సినిమాని తీసుకొచ్చేద్దాం.. అంటున్నాడ‌ట‌. కానీ అల్లు అర‌వింద్ మాత్రం సినిమా ఆల‌స్య‌మైనా ఫ‌ర్వాలేదు, అన్ని ర‌కాలుగా సంతృప్తి ప‌డిన త‌ర‌వాతే.. విడుద‌ల చేయాలి అంటున్నార్ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఊబిలో కూరుకుపోయిన వైసీపీ !

ఏపీ ఎన్నికలకు ఎజెండా సెట్ అయిపోయింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఈ అంశంపై మొదట్లో పెద్దగా...

ఏంటో ఈసీకి కూడా సీఐడీనే కనిపిస్తోందా ?

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం పొందుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ లో తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close