వైసీపీ వాళ్లనే అలా చంపితే ఇక ఎవరికి గ్యారంటీ..?

కాకినాడలో వైసీపీకి చెందిన కార్పొరేటర్‌ను ప్రత్యర్థి చంపిన వైనం ఒళ్ల గగుర్పొడిచేలా ఉంది. చచ్చే వరకూ వదిలి పెట్టకుండా కారుతో తొక్కించి చంపేశారు. ఆ కార్పొరేటర్ వైసీపీలో కీలక నేత. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా పేరు పొందాడు. సెటిల్మెంట్ లు చేయడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. అయితే.. ఆయన ఇప్పుడు అధికార పార్టీ. పైగా ద్వారంపూడి అనుచరుడు. అలాంటి గట్టి పొజిషన్‌లో ఉన్న కార్పొరేటర్‌నే నిర్భయంగా నడి రోడ్డుపై కావాలని తొక్కించి చంపేశారంటే… నేరస్తుల్లో చట్టాల పట్ల.. పోలీసుల పట్ల భయం పూర్తిగా పోయిందని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాజకీయంగా టీడీపీ నేతలపై దాడులు చేస్తూంటే పోలీసులు ఊరుకున్నారు కానీ ఇతర అంశాల్లో సిన్సియర్‌ గా ఉన్నారని ప్రజలు సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే వైసీపీ నేతలు చే సే ప్రతీ అరాచకానికి టీడీపీ ముద్ర వేసి పని పూర్తి చేసుకుంటున్నారు. దీంతో ప్రజల్లో…పోలీసుల భయం కంటే… వైసీపీ నేతల భయమే ఎక్కువయింది.అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో ఎలాంటి పరిస్థితులు మారలేదు. పట్టపగలు హత్యలు జరగడం కామన్ గా మారింది. ఇప్పుడు అది.. నడి రోడ్డుపై కారుతో తొక్కించి చంపే వరకూ వెళ్లింది.

నేర స్వభావం ఉన్న వారికి కొంచెం సందు ఇచ్చినా వారు చెలరేగిపోతారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని .. అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తారు. అలాంటి పరిస్థితి ఒకప్పుడు బీహార్‌లో ఉండేది. ప్రజలు భయపడిపోయేవారు. అందుకే ఆ పరిస్థితిని జంగిల్ రాజ్‌గా చెప్పుకుంటూ ఉంటారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఓడిపోవడానికి మళ్లీ అధికారం అందుకోవడానికి తంటాలు పడుతూండటం ఆ జంగిల్ రాజే కారణం. ఇప్పుడు ఆ పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close