కొడాలి నానికీ హైకోర్టులో రిలీఫ్.. కానీ కండిషన్స్ అప్లై..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై తిట్ల దండకం అందుకోవడం.. ఆయన మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడం … వారు హైకోర్టుకు వెళ్లడం… హైకోర్టు ఎస్‌ఈసీ, ఎన్నికల ప్రక్రియపై మాత్రం మాట్లాడకుండా… ఇతర విషయాలు మీడియాతో మాట్లాడేలా రిలీఫ్ ఇవ్వడం కామన్‌గా జరిగిపోతోంది. తాజాగా కొడాలి నాని విషయంలోనూ హైకోర్టు అదే విధంగా స్పందించింది. కొడాలి నాని ప్రెస్‌మీట్ వీడియోతో పాటు .. ఆయన అన్న మాటలన్నింటినీ యధావిధిగా స్క్రిప్ట్ రూపంలో తెప్పించుకుని పరిశీలించిన హైకోర్టు… దీనిపై లోతైన విచారణ జరపాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ లోపు మధ్యేమార్గంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ఒక్క రోజు ముందుగానే స్పష్టం చేసింది. దాని ప్రకారం… తీర్పు ఇచ్చింది. కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చు కానీ… ఎస్‌ఈసీ, ఎన్నికల ప్రక్రియ విషయం మాట్లాడకూడదని హైకోర్టు దిశానిర్దేశం చేసింది.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మొదటగా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ… ఇద్దరూ నిమ్మగడ్డ తిట్ల దండకం ప్రారంభించారు. తర్వాత బొత్స సైలెంటయ్యారు. పెద్దిరెడ్డి మాత్రం… ఆయనను జైలుకు పంపిస్తామన్న విధంగానూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో… ఆయనను గృహనిర్బంధం చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. రెండు సార్లు కోర్టుకు వెళ్లి… కొద్దికొద్దిగా రిలీఫ్‌లు తెచ్చుకున్నారు. ఎన్నికల ప్రక్రియ, ఎస్‌ఈసీపై మాట్లాడవద్దని హైకోర్టు చివరికి తేల్చేసింది. దీతో మాట్లాడటానికి ఏముంటుందని ఆయన మీడియా ముందుకు రావడం లేదు. ఆ తర్వాత జోగి రమేష్ పైనా అలాంటి చర్యలే తీసుకున్నారు. తర్వాత కొడాలి నానిని వైసీపీ రంగంలోకి దించింది. ఇప్పుడు ఆయన కూడా ఎస్‌ఈసీ, ఎన్నికల ప్రక్రియపై మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయింది.

వైసీపీలో అలాంటి నోరున్న నేతలు చాలా మంది ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు అలా తెర మీదకు వస్తూనే ఉంటారు. పెద్దిరెడ్డి, జోగి రమేష్, కొడాలి నానిల తర్వాత మరొకరు వచ్చి ఎస్ఈసీపై విరుచుకుపడగలరు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగా ఎస్‌ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కాకుండా… విపక్షం వైపు నుంచి ఇప్పుడు.. ఎస్‌ఈసీపై విమర్శలొస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలకు … నిమ్మగడ్డను బూతులు తిట్టించాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే ఇంకెవరూ అలాంటి లాంగ్వేజ్‌తో మీడియా ముందుకు రాకపోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close