‘పాగ‌ల్’ టీజ‌ర్: ఏ వైల్డ్ ల‌వ‌ర్‌!

‘ఫ‌ల‌క్ నామా దాస్’ తో మాస్ కి ద‌గ్గ‌ర‌య్యాడు విశ్వ‌క్ సేన్‌. ‘హిట్‌’తో మ‌రో హిట్టు కొట్టాడు. ఇప్పుడు ఓ ప్రేమికుడిగా మారిపోయాడు. ప్రేమికుడంటే… అట్టాంటిట్టాంటి ప్రేమికుడు కాదు. బాగా వైల్డ్‌. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈరోజు.. టీజ‌ర్ ని వ‌దిలారు.

‘ల‌వ‌ర్.. ల‌వ‌ర్’ అంటూ.. ప‌దే ప‌దే ప‌ల‌వ‌రించే పాగ‌ల్ ప్రేమికుడిగా.. విశ్వ‌క్ సేన్ ద‌ర్శ‌క మిచ్చాడు. త‌న లుక్ కూల్ గా ఉన్నా, క్యారెక్ట‌రైజేష్ కాస్త వైల్డ్ గా ఉంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే.

‘ఏయ్‌.. ఎవ‌డ్రా… నా ల‌వ‌ర్ ని ఏడిపించింది’ అనే డైలాగ్ తో టీజ‌ర్ మొద‌లైంది.

‘రేయ్‌.. నా ల‌వ‌ర్ ఫేస్ లో హ్యాపీ నెస్ క‌నిపించ‌డం లేదు. స్ట్రాంగ్ గా కొట్టండి. వైల్డ్ గా కొట్టండి.. నా ల‌వ్ లా కొట్టండి..’ అంటూ రెచ్చిపోయి.. మ‌రీ రౌడీల చేత కొట్టించుకుంటాడు. ల‌వ్‌.. లా అనే ప‌దంలో మీకేదైనా బూతు గోచ‌రిస్తే.. అందులో మీ త‌ప్పేం లేద‌నే అనుకోవాలాలి.

‘నేను సినిమాలు చూడ‌.. చేయి చూశావా ఎంత ర‌ఫ్ గా ఉందో.. ఓన్లీ బిట్లు..’ అంటూ.. రాహుల్ రామ‌కృష్ణ వేసిన పంచ్ తో… టీజ‌ర్ ముగిసింది.

మాస్‌కి మ‌ఖ్యంగా కుర్ర‌కారుకి కావ‌ల్సిన బిట్లు.. ఈ సినిమాలో బోలెడున్నాయ‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతూనే ఉంది. వాళ్ల‌కు న‌చ్చేస్తే… విశ్వ‌క్ ఖాతాలో మ‌రో హిట్టు చేర‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.