బీజేపీ మళ్లీ సీబీఐ కేసుల బెదిరింపులు..!

తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలు సైలెంట్‌గా ఉంటున్నా భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం సీబీఐ జపాన్ని మాత్రం వదలడం లేదు. మిషన్ తెలంగాణను పెట్టుకున్న బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ … తెలంగాణ పర్యటనకు వచ్చి నేరుగా కేసీఆర్ కుమార్తె కవితకు హెచ్చరికలు జారీ చేశారు. సింగరేణి బెల్ట్‌లో పర్యటించిన తరుణ్ చుగ్.. అక్కడ కార్మిక యూనియన్లలో పట్టు పెంచుకున్న కవితను టార్గెట్ చేశారు.

యూనియన్‌ లీడర్‌గా ఎమ్మెల్సీ కవిత అంతా తన చేతిలో పెట్టుకున్నారని.. ఎమ్మెల్సీ కవితకు తానిచ్చే మెసేజ్‌ ఒకటేనని.. దోపిడీ దొంగల్ని బీజేపీ ఎప్పుడూ వదిలిపెట్టలేదనేదేనని ఆయన చెప్పుకొచ్చారు. వదిలి పెట్టకుండా ఎలా పట్టుకుంటారంటే.. టీఆర్ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర హోంశాఖ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

బండి సంజయ్ కూడా అంతకు ముందు అదే పనిగా సీబీఐ గురించి మాట్లాడేవారు. తమ దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయని.. కోర్టులో పిటిషన్లు వేస్తామని చెప్పేవారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామనేవారు. కేసీఆర్ కు జైలు మాత్రమే మిగిలిందని హెచ్చరించేవారు. అయితే గ్రేటర్ ఎన్నికల తర్వాత.. కేసీఆర్ సైలెంట్ కావడంతో బండి సంజయ్ నోట.. కేసీఆర్ జైలు అనే మాటలు రావడం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బీజేపీ వ్యవహారాల ఇన్చాజ్ తరుణ్ చుగ్ నేరుగా… కవితకు హెచ్చరికలు జారీ చేశారు. సైలెంట్ గా ఉంటే బీజేపీ నేతలు మరింతగా రెచ్చిపోతారని ఇటీవల కాలంలో కౌంటర్లు ఇస్తున్నారు. అయితే అవి కంట్రోల్‌లోనే ఉంటున్నాయి.

తరుణ్ చుగ్‌ను ఏమీ అనకుండా రొటీన్ విమర్శలు చేసిన బండి సంజయ్ పై … ప్రభుత్వ విప్ సుమన్ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మొత్తానికి కాస్త ఆలస్యమైనా… ీబజేపీ మళ్లీ సీబీఐ బెదిరింపులు ప్రారంభించింది. మరి టీఆర్ఎస్ ఏం చేస్తుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close