క్రైమ్ : కిలాడి లేడీ.. ఇట్టే రూ. 11కోట్లు హాంఫట్..!

అమ్మాయి కాస్త కంటికి అందంగా కనిపించే సరికి ఫ్లాటైపోయాడు. ఐఏఎస్ అఫీసర్ననని బడాయి పోయే సరికి ముందూ వెనుకా చూసుకోకుండా నమ్మేశాడు. ఓ అమ్మాయిని తీసుకొచ్చి తన చెల్లేనని పెళ్లి చేస్తానని అనే సరికి మెలికలు తిరిగిపోయాడు. ఈ క్రమంలో తన ఆస్తులు రూ. పదకొండు కోట్లు కరిగిపోయాయని… మొత్తం.. ఆ లేడీకి సమర్పించేసుకున్నానని గుర్తించలేకపోయాయి. అమ్మాయి మత్తు మొత్తం దిగిన తర్వాత చూసుకుంటే…కానీ తాను పూర్తి స్థాయిలో మోసపోయానని గుర్తించలేకపోయాడు. లబోదిబోమంటూ పోలీసుల వద్దకు వెళ్లాడు. కానీ ఆరు కోట్ల ఆస్తులు మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. మిగతా ఐదు కోట్లు.. ఆ కిలాడీ లేడీ జల్సాలకు ఖర్చయిపోయాయి.

శృతి సిన్హా , ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఓ యువతి లెటర్ ప్యాడ్‌లు ప్రింట్ చేయించుకుంది. ఆమె అసలు పేరేమిటో పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. రాఘవరెడ్డి, రణధీణ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, విజయకుమార్ రెడ్డి అనే నలుగురి సాయంతో ముఠా మోసాలకు పాల్పడటం ప్రారంభించారు. వీరందరూ.. ఐఏఎస్‌లమనో.. ఐఏఎస్‌కి సెల్కక్ట్ అయ్యామనో చెప్పి.. మోసాలు చేసేవాళ్లు. వీరి చేతికి వీరారెడ్డి అనే వ్యాపారి చిక్కాడు. శృతి సిన్హా చెప్పే మాటలన్నింటినీ నమ్మేసిన వీరారెడ్డి వీరు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చేవాడు. వీరారెడ్డికి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తానని శృతి సిన్హా ఆశ పెట్టింది. దీంతో మరింతగా సొమ్ము చెల్లించారు. ఇలా విడతల వారీగా పదకొండు కోట్లను వారు వసూలు చేశారు.

చివరికి నీరి తీరుపై అనుమానం రావడంతో వీరారెడ్డి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన పోలీసులు వారి గుట్టు రట్టు చేశారు. శృతి సిన్హా పేరుతో చెలామణి అవుతన్న మహిళతో పాటు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. విజయకుమార్ రెడ్డి అనే మరో వ్యక్తిని పట్టుకోవాల్సి ఉంది. వీరి వద్ద నుండి ఆరు కోట్ల మేర ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఒక విల్లాను కూడా స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం డబ్బు ఉన్న వారిని టార్గెట్ చేయడం ఈ ముఠా లక్ష్యమని పోలీసులు చెబుతున్నారు.

మోసాలు చేసి మరీ అనుభవిస్తున్న వీరి లైఫ్ స్టైల్ చూసి పోలీసులకే మైండ్ బ్లాంక్ అయింది. అత్యాధునిక విల్లాతో పాటు హైఎండ్ కార్లు ఐదింటిని ఉపయోగిస్తూంటారు. అన్నీ కొత్తవే. ఇక ఎక్కడికి వెళ్లినా విమానప్రయాణాలేనన్నట్లుగా ఉంటారు. స్టార్ హోటళ్లలో మాత్రమే బస. దొరికిన వారిని దొరికినట్లుగా మోసం చేయడంలో వీరి స్టైలే వేరు. ఇలాంటి వారి బారిన పడితే ఆస్తులన్నీ ఖర్చయిపోతాయని .. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close