నాగ్ నిర్ణ‌యం స‌ముచిత‌మేనా?

`వైల్డ్ డాగ్‌` ఓటీటీ రిలీజ్ నుంచి థియేట‌ర్ రిలీజ్ కి షిఫ్ట్ అయ్యింది. ఏదైనా స‌రే, ఓసినిమాని పెద్ద తెర‌పైచూడ‌డ‌మే మ‌జా! ఓటీటీ ఓ ఆప్ష‌న్ అంతే. అందుకే సినిమా రూప‌క‌ర్త‌లు ఓటీటీ రిలీజ్ కంటే థియేట‌రిక‌ల్ రిలీజ్ వైపే మొగ్గు చూపిస్తారు. అది చాలా స‌హ‌జం. `వైల్డ్ డాగ్` కూడా ఇప్పుడు అలాంటి నిర్ణ‌య‌మే తీసుకుంది. ఓటీటీ కి దాదాపు అమ్మేసిన ఈ సినిమాని బ‌య‌ట‌కు లాక్కురావ‌డం విచిత్ర‌మే. పైగా నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ‌లు అగ్రిమెంట్లు ప‌క్కాగా చేసుకుంటాయి. అవ‌న్నీ దాటుకుని, సినిమాని వెన‌క్కి తెచ్చుకోవ‌డంలో నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ప్ర‌మేయం, ప్ర‌భావం చాలా ఉన్నాయి. ఆయ‌న ఓ లాయ‌ర్‌. కాబ‌ట్టి… అగ్రిమెంట్ల‌లోని లూప్ హోల్స్ బాగా క‌నిపెట్టి, `వైల్డ్ డాగ్‌` అగ్రిమెంట్లు కాన్సిల్ చేయించారు. ఇక మీద‌ట ఓటీటీ సంస్థ‌లు ఎగ్రిమెంట్ల విష‌యంలో ఇంకాస్త క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాయేమో..?

అయితే ఈ నిర్ణ‌యం స‌ముచిత‌మేనా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ముందే చెప్పిన‌ట్టు ఓటీటీ పై కంటే, వెండి తెర‌పై సినిమా చూడ్డానికే ప్రేక్ష‌కుడు ఇష్ట‌ప‌డ‌తాడు. అది సంప్ర‌దాయ‌క‌మైన మాధ్య‌మం. ఆ కోణంలో చూస్తే… వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు థియేట‌ర్లో చూడ‌డం స‌బ‌బే. కాక‌పోతే.. మార్కెట్ ప‌రంగా ఆలోచిస్తే, ఈ నిర్ణ‌యం అంత స‌ముచితం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ ఈసినిమాని దాదాపుగా 35 కోట్ల‌కు కొనుగోలు చేయాల‌నిచూసింద‌ని టాక్‌. నాగ్ సినిమాకి ఆ స్థాయిలో రిటర్న్ రావ‌డం గొప్ప విష‌య‌మే. ఆ మొత్తానికి ఈ సినిమాని అమ్మేస్తే నిర్మాత మంచి లాభాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్టే. నాగ్ సినిమాలు ఈమ‌ధ్య బాక్సాఫీసు ద‌గ్గ‌ర స‌రైన ప్ర‌భావం చూపించలేక‌పోయాయి. ఆఫీస‌ర్‌, మ‌న్మ‌థుడు 2 డిజాస్ట‌ర్ అయ్యాయి. క‌నీసం వీటికి ఓపెనింగ్స్ కూడా లేవు. `వైల్డ్ డాగ్` కూడా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా కాదు. అదో యాక్ష‌న్ డ్రామా. దానికంటూ సెప‌రేట్ ఆడియన్స్ ఉంటారు. సినిమా హిట్ట‌యి బాగుంది అనే టాక్ వ‌స్తే త‌ప్ప‌, ఈ సినిమా క్రౌడ్ పుల్ల‌ర్ కాదు. ఓటీటీకి అమ్మేసినా, మిగిలిన శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ఉంటాయి. ఏ ర‌కంగా చూసినా.. ఇది మంచి డీలే. అయితే క్రాక్‌, ఉప్పెన లాంటి సినిమాల‌కు వ‌చ్చిన వ‌సూళ్లు చూసి నిర్మాత‌లు ఉత్సాహ‌ప‌డి ఉంటారు. అయితే.. ఇప్పుడు థియేట‌రిక‌ల్ నుంచి.. `వైల్డ్ డాగ్` 36 కోట్ల‌కుపైనే (షేర్‌) సంపాదించుకోవాలి. అప్పుడే.. ఓటీటీ నుంచి సినిమాని బ‌య‌ట‌కు తీసుకొచ్చినందుకు త‌గిన ప్ర‌తిఫ‌లం ఉంటుంది. నాగ్ సినిమా ఆ స్థాయిలో షేర్ తెచ్చుకోవాలంటే.. క‌నీసం 50 కోట్ల గ్రాస్ సంపాదించాలి. నాగ్ త‌ప్ప‌… ఈ సినిమాకి పెద్ద‌గా స్టార్ కాస్ట్ లేదు. మ‌రి ఇలాంట‌ప్పుడు 50 కోట్ల మ్యాజిక్ ఫిగ‌ర్ నాగ్ కి సాధ్య‌మేనా? అనేది తేలాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close