ప‌వ‌న్ హీరోయిన్ కూడా దొంగే

ప‌వ‌న్ క‌ల్యాణ్ -క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. శివ‌రాత్రి సంద‌ర్భంగా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌నీ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ప‌వ‌న్ దొంగ‌గా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ ఒక్క‌డే దొంగ కాదు. హీరోయిన్ కూడా దొంగే. వారిద్ద‌రి మ‌ధ్య సీన్లు.. క్రిష్ చాలా అందంగా, వినోదాత్మ‌కంగా రాసుకున్నాడ‌ట‌. ఇందులో.. నిధి అగ‌ర్వాల్‌, జాక్వెలెన్ ఫెర్నాండేజ్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిధిది రాకుమారి టైపు పాత్ర‌. జాక్వెలెన్ దొంగ‌. కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరిగే క‌థ ఇది. ఆ వ‌జ్రాన్ని దోచుకోవ‌డానికి వీర‌మ‌ల్లు చేసే ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో సినిమా న‌డుస్తుంది. ఈ సినిమా కోసం చార్మినార్‌, గోల్కొండ, కుతుబ్ మినార్ సెట్లు వేశారు. 2022 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close