సైకిల్ ఎక్కిన సోనూసూద్‌

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న రోజు… విజ‌య్ సైకిల్ ఎక్క‌డం సంచ‌ల‌నం సృష్టించింది. బీజేపీ ప్ర‌భుత్వం పెంచుతున్న పెట్రోల్ ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా.. విజ‌య్ – ఈ ప్ర‌య‌త్నం చేశాడ‌న్న‌ది తెల‌ప‌క‌నే తెలుస్తోంది. ఇప్పుడు సోనూసూద్ కూడా సైకిల్ ఎక్కాడు. అయితే సోనూ ఆలోచ‌న‌లు వేరు. విజ‌య్ ప్ర‌య‌త్నంలో నిర‌స‌న ఉంటే, సోనూ సైకిల్ ప్ర‌యాణంలో ఆరోగ్య సూత్రాలు దాగున్నాయి.

ఆచార్య‌లో సోనూ.. ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కోకా పేట‌లో తీర్చిదిద్దిన ఓ సెట్లో షూటింగ్ జ‌రుగుతోంది. సోనూ… పార్క్ హ‌య‌త్ లో విడిది చేస్తున్నాడు. అక్క‌డి నుంచి లొకేష‌న్ కు,.. సైకిల్ పై బ‌య‌ల్దేరాడు సోనూ. దాదాపు అర‌గంట‌.. సైకిల్ తొక్కి, లొకేష‌న్‌కి చేరుకున్నాడు. సోనూకి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పైగా.. ఉద‌యాన్నే సెట్ కి వెళ్లాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకే సైకిల్ ఎక్కాడు. అటు వ్యాయామం, ఇటు.. ప్ర‌యాణం రెండూ క‌లిసొచ్చేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close