మిస్టరీగా మారిన డ్రైవర్ మృతి

హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ ఇవాళ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే గన్ మ్యాన్ రవీందర్‌ తుపాకీని పక్కన పెట్టినపుడు అక్బర్ తీసుకుని పరిశీలిస్తుండగా అది మిస్ ఫైర్ అయ్యిందని చెబుతున్నారు. బుల్లెట్‌లు అక్బర్ తలలోకి దూసుకెళ్ళిపోతుండటంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అక్బర్ మహబూబ్ నగర్ జిల్లా చౌదరిపల్లె గ్రామానికి చెందినవాడని తెలిసింది. మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్బర్ తుపాకి ప్రమాదవశాత్తూ పేలి చనిపోయాడా లేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అక్బర్ మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు. అతని కుటుంబసభ్యులు మాత్రం దీనివెనక ఏదో మిస్టరీ ఉందని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎమ్మెల్యే గన్‌మ్యాన్ రవీందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close