మోడీని విమర్శించారని జార్ఖండ్ సీఎంపై జగన్ ఫైర్..!

జార్ఖండ్ ముఖ్యమంత్రి… తన ప్రజలకు కరోనా విషయంలో అండగా నిలవలేకపోతున్నానని.. కష్టాలు చెప్పుకునేందుకు టీమిండియా కెప్టెన్ అయిన మోడీ కనీసం చాన్సివ్వడం లేదని.. నోరు తెరవనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చాలా బాధేసింది. వెంటనే సోషల్ మీడియాలో రిప్లయ్ ఇచ్చారు. హేమంత్ సోరెన్‌నను .. బీజేపీ స్టైల్లో దేశాన్ని బలహీనం చేస్తున్నారని విమర్శించారు.

జార్ఖండ్ సీఎం బాధ చెప్పుకుంటే జగన్‌కు కోపం ఎందుకు వచ్చింది..?

నిజానికి సీఎం జగన్‌కు హిందీ రాదు. జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్ హిందీలో ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్‌ను ఎవరైనా సలహాదారులు ట్రాన్స్‌లేట్ చేసి అర్థమయ్యేలా చెప్పారేమో కానీ.. జగన్‌కు చాలా బాధేసింది. ఎంత బాధేసిందంటే.. సోషల్ మీడియాలోనే రిప్లయ్ ఇచ్చారు. సోదరా అని సంబోధించి.. హేమంత్ సోరెన్ రెండు లైన్ల ట్వీట్ చేస్తే.. జగన్ ఆరు లైన్ల విమర్శలు చేశారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అండగా ఉందామని సుద్దులు చెప్పారు. కేంద్రానికి సహకరించాల్సిన తరుణంలో వేలెత్తిచూపడం తగదని సలహా ఇచ్చారు. కరోనా టైమ్‌లో రాజకీయాలు చేసి మోడీని విమర్శిస్తే దేశం బలహీనమవుతుందని చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియా ద్వారా మోడీకి వీరతాళ్లు వేస్తున్నారా..?

అసలు తనకేమాత్రం సబంధం లేకపోయినా.. ప్రధాని నరేంద్రమోడీకి వీరతాళ్లు వేయడానికి అన్నట్లుగా.. ఎక్కడో దూరంగా ఉన్న రాష్ట్రం సీఎంపై జగన్ విమర్శలు కురిపించడం… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు అడిగినన్ని టీకాలు కానీ.. కరోనా సాయం కానీ అందించకపోయినా.. మోడీని.. కేంద్రాన్ని అసలు ప్రశ్నించనే ప్రశ్నించని ఏపీ సీఎం జగన్… ప్రశ్నిస్తున్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను సోషల్ మీడియాలో విమర్శించడం ప్రారంభించారు. తమ బాధలు మోడీ వినడం లేదని హేమంత్ సోరెన్ చెప్పడమే.. రాజకీయంగా సీఎం జగన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.

బీజేపీ కౌంటర్ స్ట్రాటజీలో జగన్ భాగస్వామిగా మారారా..?

ఏపీలో జరుగుతున్న ఎన్నో అంశాలపై కనీసం నోరు మెదపని సీఎం జగన్.. అసలు … తనకేమాత్రం సంబంధం లేకపోయినా… జార్ఖండ్ సీఎం ఇష్యూలో జోక్యం చేసుకోవడం… రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నరేంద్రమోడీ గుడ్ లుక్స్‌లో ఉండటానికి జగన్ చొరవ తీసుకున్నారా లేక… విపక్షాలకు… అప్రకటిత మిత్రపక్షాలతో కౌంటర్ ఇచ్చే స్ట్రాటజీని బీజేపీ అమలు చేయడం ప్రారంభించిందా.. అన్న చర్చ జరుగుతోంది. అచ్చంగా మోడీని విమర్శిస్తే… దేశం బలహీనం అవుతుందన్నట్లుగా జగన్ ట్వీట్ పెట్టడం… అచ్చంగా బీజేపీ భావజాలంలాగే ఉంది. బీజేపీని విమర్శిస్తే.. దేశభక్తి లేదన్నట్లుగా.. కౌంటర్ వేయడం.. ప్రధానిని విమర్శిస్తే దేశాన్ని బలహీనం చేస్తున్నట్లుగా మాట్లాడటం బీజేపీ నేతల స్టైల్. ఇప్పుడు జగన్.. పూర్తిగా బీజేపీ నేతల స్టైల్లోకి వెళ్లినట్లుగా ఉన్నారన్న అంచనాలు ఈ ట్వీట్ ద్వారా ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close