తేడా వచ్చిందిగా పుట్ట మధు కూడా ఇక నిందితుడే..!?

చట్టాలు పాలకుల చేతుల్లో ఎలా చుట్టాలుగా మారుతాయో.. మరో ఉదాహరణ తెలంగాణలో కళ్ల ముందు సాక్ష్యాలతో సహా కళ్ల ముందు కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట.. తెలంగాణలో వామనరావు అనే లాయర్‌తో పాటు.. న్యాయవాది అయిన ఆయన భార్య కూడా .. పట్ట పగలు నడి రోడ్డుపై దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ కేసులో అన్ని వేళ్లూ.. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వైపే చూపించాయి. చాలా నేర ప్రవర్తి ఉన్న ఆయన .. లాయర్ దంపతుల హత్యకు రింగ్ మాస్టర్ అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. చనిపోయిన లాయర్ దంపతుల తండ్రి కూడా పుట్ట మధుపై ఫిర్యాదు చేశారు. కానీ టీఆర్ఎస్‌లో కీలక నేత కావడంతో ఈగ వాలలేదు. స్వయంగా పుట్ట మధు బావమరిది ప్రమేయంపై సాక్ష్యాలు దొరికినా … పుట్ట మధు జోలికి మాత్రం వెళ్లలేదు.

నిజానికి పుట్ట మధు అనే నేతపై వామనరావు దంపతులు పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తున్నారు. అక్రమాలను అడ్డుకుంటున్నారు. ఆయన అక్రమాస్తులపై కేసులు వేశారు. ఈకారణంగానే హత్య చేశారనేది ప్రధానంగా ఉన్న అభియోగం. అయితే టీఆర్ఎస్‌ నేత అయిన కారణంగా ఆయనపై ఈగ వాలలేదు. జబర్దస్తీగా అప్పట్లో ప్రెస్‌మీట్ పెట్టి.. తనపై ఆరోపణలు చేస్తున్న వారిని చాలెంజ్ కూడా చేశారు. అంతగా ధీమా పొందిన పుట్టమధును హఠాత్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే.. ఆయనకు టీఆర్ఎస్‌తో తేడా వచ్చింది. పుట్ట మధు ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడు. ఈటల రాజేందర్ కుమారుడితో కలిసి పుట్ట మధు వ్యాపారాలు చేస్తున్నారు. ఎలా చూసినా ఆయన ఈటల వర్గమే అవుతారనుకున్న ప్రభుత్వ పెద్దలు ఆయనను టార్గెట్ చేశారు. వారం రోజుల కిందటే అదుపులోకి తీసుకున్నారేమో తెలియదు కానీ.. ఆయన అదృశ్యమయ్యారని కలకలం రేగిన తర్వాత అరెస్ట్ చూపించారు. ఈ వారం రోజులు.. ఈటల రాజేందర్.. ఆయనకుమారుడి గుట్టుముట్లు ఏమైనా తెలిస్తే.. బయటకు లాగి ఉంటారేమో కానీ.. ఇప్పుడు…మాత్రం ఆ లాయర్ దంపతుల హత్య కేసులో విచారించడం ప్రారంభించారు.

రేపోమాపో ఆయనపై సాక్ష్యాలున్నాయని అరెస్టు చూపినా ఆశ్చర్యం లేదు. నిజానికి ఇక్కడ మనం చూడాల్సింది రాజకీయ కోణం కాదు. చట్టం ప్రకారం.. లాయర్ దంపతుల హత్య లాంటి సీరియస్ కేసులోనూ.. రాజకీయ పార్టీ పరంగా బలం చూసుకుని.. రిలీఫ్ పొందిన వ్యక్తి.. ఇప్పుడు ఆ పార్టీ విశ్వాసం కోల్పోయినందున కేసుల్లో ఇరుక్కుంటున్నాడు. అంటే అధికార పార్టీలో ఉంటే.. హత్యల్లాంటివి చేసినా.. చట్టం చుట్టంగా మారిపోతుందన్నమాట. వ్యవస్థలో ఉన్న ఈ లోపాలే..ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదంగా మారుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close