టీ పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పుడల్లా లేనట్లే..!

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవాలన్న ఆలోచన పెద్దగా ఉన్నట్లుగా లేదు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరమైన సమస్యల పరిష్కారానికి ఏదో ఒకటి చేస్తున్నప్పటికీ.. తెలంగాణ విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి అవలంభిస్తోంది. ప్రతీసారి రేవంత్ రెడ్డి పేరు ఖరారయిందని ప్రచతారం జరగడం… ఆయనకు వ్యతిరేకంగా ఓ గ్రూప్ .. రెడీ అయి రచ్చ చేయడం కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇదిగో పీసీసీ చీఫ్‌ను ప్రకటించేస్తున్నారంటూ… లీక్ రాగానే.. వీహెచ్ నుంచి జగ్గారెడ్డి వరకూ అందరూ బయటకు వచ్చారు. చివరికి చేరాల్సిన వారంతా ఢిల్లీకి చేరారు. తీరా అక్కడ మాత్రం హైకమాండ్… ఇప్పుడు కాదు.. ఇంకాస్త ఆలోచిస్తామని సమాచారం ఇచ్చిందట.

కొద్ది రోజుల కిందట కేరళ పీసీసీ ప్రెసిడెంట్ ను ప్రకటించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో హడావిడి మొదలైంది. ఢిల్లీ పెద్దలు పీసీసీ ఎంపిక మీద ఫోకస్ పెట్టినట్లు జరిగిన ప్రచారంతో టి.కాంగ్రెస్ నేతలు అలెర్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మధుయాష్కీ వంటి నేతలు ఢిల్లీ చేరుకున్నారు. కొందరు నేతలు హస్తినలోనే మకాం వేసి మంత్రాంగం నడుపుతుండగా, మరికొందరు హైద్రాబాద్, ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. పీసీసీ కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మానిక్కం ఠాగూర్.. సోనియాగాంధీ కి ఓ నివేదికను సమర్పించారు. దాని పై అధినేత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఢిల్లీ లో ఏం జరుగుతుందో ఏమోగాని రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతోందని లీకులు వచ్చాయి. ఇంచార్జి మానిక్కం ఠాగూర్ తో పాటు ఏఐసీసీ జెనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ఇద్దరు కూడా రేవంత్ పేరునే ప్రతిపాదిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దాంతో టి.కాంగ్రెస్ లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. సీనియర్లు, ఇతర ఆశావహులు అంతా అప్రమత్తం అయ్యారు. పార్టీలో మొదటి నుంచి పని చేస్తోన్న సీనియర్ లకే పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ మీద ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. కర్ణాటక, పంజాబ్ తరహాలో తెలంగాణకు కూడా పరిశీలకుల కమిటీ ని వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చివరికి ప్రకటన వాయిదా వేయడం ఖాయమని లీక్ వచ్చింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ మరోసారి ఉసూరుమంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ పర్సంటేజీ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకతేనా ?

ఏపీలో పోలింగ్ శాతం గత ఎన్నికల కన్నా రెండు శాతం పెరిగింది. ఈ రెండు శాతం చిన్నది కాదు. ఎందుకంటే హై పోలింగ్ లో ఎంత చిన్న మొత్తం పెరిగినా...

రేవంత్‌కు రుణమాఫీ అంత వీజీ కాదు !

రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రేవంత్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. హామీని పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఇప్పుడు రెండు...

అదే వైసీపీ కొంపముంచనుందా..?

ఏపీలో అధికారపీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎవరిని కదిలించినా ఫలితాల గురించే ముచ్చట. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో కూటమిదే విజయమని...

‘మిరల్’ రివ్యూ: చీకటి నాటకం

ఈ సమ్మర్ లో సరైన సినిమా పడలేదు. అక్యుపెన్సీ లేకపోవడంతో సింగిల్ స్క్రీన్స్ రెండు వారాలు క్లోజ్ చేస్తున్నట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ వారం రావాల్సిన సినిమాలు వెనక్కి వెళ్ళాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close