ఆదిత్యనాథ్‌ను రిటైర్ చేయించాలని టీడీపీ ఫిర్యాదు..!

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగింపు వ్యవహారం రాజకీయ వివాదాలకు కేంద్రం అవుతోంది. ఇప్పటికే ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పెంచాలని ఏపీ ప్రభుత్వం .. కేంద్రానికి లేఖ రాసింది.ఆయన సేవలు ప్రస్తుతం చాలా అవసరం అని చెబుతోంది. అదే సమయంలో ఆదిత్యనాథ్ దాస్ కు పొడిగింపు ఇవ్వవొద్దని తెలుగుదేశం పార్టీ తరపున ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. డీవోపీటీకి లేఖ రాశారు. అందులో ఆదిత్యనాథ్ దాస్ .. సీఎస్‌గా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు మాత్రమే కాదు… జగన్ కేసులో నిందితుడిగా ఉన్నారని.. ఆ కేసుల్లో క్విడ్ ప్రో కో కింద లంచాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న ఇండియా సిమెంట్స్ సంస్థకు.. సీఎస్‌గా మరిన్ని మేళ్లు చేశారని.. ఆరోపిస్తూ.. లేఖకు ఆధారాలు జత చేశారు.

సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ను కొనసాగిస్తే.. ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరమని.. ఎంపీ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు డీవోపీటికి ఫిర్యాదులు అందడంతో… కేంద్రం .. ఆదిత్యనాథ్ దాస్‌కు పొడిగింపు ఇస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉంటే.. పొడిగింపు లభిస్తోంది. చంద్రబాబు హయాంలో… ఎవరికీ పెద్దగా పొడిగింపులు ఇవ్వలేదు. అయితే ఇటీవల కరోనా కారణంగా కీలక అధికారులు మధ్యలో రిటైరైతే.. తదుపరి చర్యలకు ఇబ్బందికరం అన్న అభిప్రాయాలు వినిపించడంతో రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు పదవీ కాలం పొడిగిస్తున్నారు.

గరిష్టంగా ఆరు నెలలు మాత్రమే పొడిగింపు లభిస్తోంది. అయితే సాధారణంగా.. సీఎస్‌ల పదవీ కాలం పొడిగింపు అనేది ప్రభుత్వాలకు సంబంధించినదే అయి ఉంటుంది. ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేసేది తక్కువే. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. డీవోపీటీకి … బెంగాల్ సీఎస్ పదవీ కాలం పొడిగింపు వ్యవహారం … ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏపీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close