నాని తెలివితేట‌లు మామూలుగా లేవు!

హీరోగానే కాదు, నిర్మాత‌గానూ నాని స‌క్సెసే. తొలి ప్ర‌య‌త్నంగా `అ` తీశాడు. ఆ త‌ర‌వాత‌… `హిట్` వ‌చ్చింది. రెండూ నానికి మంచి లాభాల్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు `మీట్ క్యూట్` మొద‌లెట్టాడు. ఇది ఓ ర‌కంగా లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో ఏకంగా అయిదుగురు హీరోయిన్లుంటార‌ని టాక్‌. ఆ అంకె పెర‌గొచ్చు కూడా. ఆ పాత్ర‌ల్లో పేరున్న క‌థానాయిక‌ల‌నే తీసుకోవాల‌న్న‌ది నాని ఆలోచ‌న‌. అన్నీ ఒక‌ట్రెండు రోజుల పాత్ర‌లే. అందుకోసం.. ఆయా హీరోయిన్ల‌ను `అతిథి` పాత్ర‌లంటూ ఒప్పించ‌గ‌లిగాడు నాని. పారితోషికాలు ఇచ్చినా అవి నామ మాత్ర‌మే. పైగా నాని సినిమా కాబ‌ట్టి, అదో ప్ర‌యోగాత్మ‌క సినిమా కాబ‌ట్టి.. హీరోయిన్లూ న‌టించ‌డానికి రెడీ అంటున్నారు. సాధార‌ణంగా హీరోయిన్ల‌ను ఒక‌ట్రెండు రోజుల పాత్ర‌ల‌కు ఒప్పించ‌డం చాలా క‌ష్టం. ఒప్పుకున్నా. బాగా డిమాండ్ చేస్తారు. కానీ.. నాని ద‌గ్గ‌ర ఎవ‌రూ నోరు మెద‌ప‌రు. మొహ‌మాటం కొద్దో. అభిమానం కొద్దో… ఇచ్చిన‌దంతా తీసుకుని చేస్తారు. అలానే ఈ సినిమా పూర్తి చేయాల‌నుకుంటున్నాడు నాని. త‌న నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే క‌చ్చితంగా మేట‌ర్ ఉండే ఉంటుంది. పైగా త‌న సినిమాని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో నానికి తెల‌సు. కాబ‌ట్టి.. బిజినెస్ ప‌రంగా ఈ సినిమా ముందే హిట్టు. సో… నిర్మాత‌గా నాని హ్యాట్రిక్ కొట్టేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close