ఇండియ‌న్ 2… ప‌రిష్కారం ఇప్పుడైనా దొరుకుతుందా?

శంక‌ర్ రాసుకున్న `ఇండియ‌న్ 2` క‌థ‌లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో తెలీదు గానీ – ఈ ప్రాజెక్టుకు రోజుకో ట్విస్టు ఎదుర‌వుతోంది. ఇండియ‌న్ 2.. ప్రాజెక్టు ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య అభిప్రాయ బేధాల‌తో ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ ఈ సినిమా పూర్తి చేసేంత వ‌ర‌కూ మ‌రో సినిమా చేయ‌కుండా ఆపాల‌ని.. నిర్మాత‌ల‌కు కూడా మ‌ద్రాస్ హైకోర్టులో పిటీష‌న్ వేశారు. ఈ విష‌యంలో కోర్టు కూడా ఏం చెప్ప‌లేక‌పోయింది. `మీలో మీరు తేల్చుకోండి` అంటూ నిర్ణ‌యాన్ని దర్శ‌క నిర్మాత‌ల‌కే వ‌దిలేసింది. అయితే ఇప్పుడు మ‌ద్రాస్ హైకోర్టు ఓ ప‌రిష్కార మార్గం సూచించింది. ఈ కేసులో మ‌ధ్య‌వ‌ర్తిగా ఓ మాజీ న్యాయ‌మూర్తిని నియ‌మించింది. శంక‌ర్‌కీ, లైకా ప్రొడక్ష‌న్‌కీ మ‌ధ్య రాజీ కుద‌ర్చ‌డానికి ఇది వ‌ర‌కు ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. క‌మ‌ల్ కూడా…. రాజీ కుద‌ర్చే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ వీలు కాలేదు. ఇప్పుడు మాజీ న్యాయ‌మూర్తి రంగంలోకి దిగారు. ఇప్పుడైనా ఈ స‌మ‌స్యకు ప‌రిష్కార మార్గం దొరుకుతుందేమో చూడాలి. మ‌రోవైపు శంక‌ర్‌.. రామ్ చ‌ర‌ణ్ ప్రాజెక్టులో బిజీ అవుతున్నాడు. చెన్నైలో క‌థా చ‌ర్చ‌లు జోరుగా న‌డుస్తున్నాయి. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ కి ఫైన‌ల్ నేరేష‌న్ ఇవ్వ‌బోతున్నాడ‌ని, ఆ త‌ర‌వాత చ‌ర‌ణ్ నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close