ప‌వ‌న్ – హ‌రీష్‌.. ఇచ్చే సందేశం ఏమిటంటే..?

`గ‌బ్బ‌ర్ సింగ్`తో త‌న త‌డాఖా చూపించాడు హ‌రీష్ శంక‌ర్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ ని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూపించేశాడు. ఆ త‌ర‌వాత‌.. ప‌వ‌న్ నుంచి అంత మాస్, క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ మ‌రోటి రాలేదు. ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ – హ‌రీష్ జ‌ట్టు క‌ట్ట‌బోతున్నారు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. `ఈసారి ఎంట‌ర్‌టైన‌ర్ మాత్ర‌మే కాదు` అంటూ.. కాన్సెప్ట్ పోస్ట‌ర్ లోనే చెప్పేశాడు హ‌రీష్ శంక‌ర్‌. అంటే.. వినోదంతో పాటు, సందేశాన్ని కూడా మిక్స్ చేస్తున్న‌ట్టు చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు. ఆ సందేశం ఏమిటి అనే సందేహం అందరిలోనూ ఉంది. ప‌వన్ రాజ‌కీయాల‌లో బిజీగా ఉన్నాడు కాబ‌ట్టి.. ఈ క‌థ‌లో పొలిటిక‌ల్ డ్రామా మిక్స్ చేసే అవ‌కాశం ఉంద‌న్న ఊహాగానాలు ఎక్కువ‌య్యాయి.

నిజానికి ఈ సినిమాలో పాలిటిక్స్ ఏమాత్రం క‌నిపించ‌వు. హ‌రీష్ అనుకుంటున్న కాన్సెప్ట్ వేరే. ఈసారి విద్యావ్య‌వ‌స్థ‌పై.. ఓ సెటైర్ వేయ‌బోతున్నాడ‌ట‌. అది కూడా రాజ‌కీయాల‌కు అతీతంగా. ప‌వ‌న్ పాత్ర‌లో రెండు కోణాలుంటాయ‌ని, ఓ కోణంలో ప‌వ‌న్ పాత్ర చాలా జోవియ‌ల్‌గా ఉంటుంద‌ని, మ‌రో కోణంలో ప‌వ‌న్ పాత్ర ప్ర‌శ్నించ‌డం మొద‌లెడుతుంద‌ని.. అదంతా విద్యావ్య‌వస్థ‌ని టార్గెట్ చేసే కోణంలో సాగుతుంద‌ని స‌మాచారం. అంతే కాదు.. కొన్ని స‌న్నివేశాల్లో తెలుగు భాష గొప్ప‌ద‌నం, సంస్కృతి విశిష్ట‌త చెప్పబోతున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి… హ‌రీష్ శంక‌ర్ బ‌ల‌మైన కాన్సెప్టే ప‌ట్టుకున్నాడు. ప‌వ‌న్ లాంటి హీరోలు చెబితే.. అది మ‌రింత బ‌లంగా, సూటిగా జ‌నంలోకి వెళ్తుంది. ఇప్ప‌టికే.. హ‌రీష్ క‌థ‌ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయ‌డం, ప‌వ‌న్ కి వినిపించ‌డం జ‌రిగిపోయాయి. ప‌వ‌న్ ఎప్పుడంటే అప్పుడు సినిమాని ప‌ట్టాలెక్కించేయ‌డ‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close