ఈ వేసవిలో టాలీవుడ్ ఎలా ఉండబోతోంది? ఏ సినిమాలు రాబోతున్నాయి? అనే విషయంలో ఓ సందిగ్థత నెలకొంది. పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో తచ్చాడుతుండడంతో షెడ్యూల్ అంతా గందరగోళంగా మారింది. మార్చిలో రావాల్సిన సినిమాలు ఎప్పుడు వస్తాయి? కొత్త రిలీజ్ డేట్లు ఏమిటి? అనే విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో `ఉస్తాద్ భగత్ సింగ్`, `పెద్ది` సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాయి. మిగిలిన సినిమాలకు లైన్ క్లియర్ చేశాయి.
మార్చి 26న ‘ఉస్తాద్’ విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఆ వెంటనే ‘పెద్ది ‘రిలీజ్ డేట్ కూడా ఖాయమైంది. ఏప్రిల్ 30న ‘పెద్ది’ని విడుదల చేస్తున్నామంటూ నిర్మాతలు అధికారికంగా ఎనౌన్స్ చేశారు. ఇవి రెండూ క్రేజీ ప్రాజెక్టులు. వీటికి సంబంధించిన రిలీజ్ డేట్ ఖాయమయ్యే సరికి మిగిలిన సినిమాలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక ‘పారడైజ్’ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ రావాల్సివుంది. ‘డెకాయిట్’, ‘లెనిన్’, ‘స్వయంభూ’ చిత్రాలు కూడా ఒకొక్కటిగా రిలీజ్ డేట్లు ప్రకటించుకోనున్నాయి. ప్రభాస్ సినిమా `ఫౌజీ`కి సంబంధించిన ఓ అప్ డేట్ కూడా రాబోతోందని టాక్. ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఆ రిలీజ్ డేట్ కూడా ఫిక్సయ్యే ఛాన్సుంది.
టాలీవుడ్ కి సంబంధించినంత వరకూ వేసవి కీలకమైన సీజన్. ఈసారి ‘ఉస్తాద్’, ‘పెద్ది`, ‘పారడైజ్’ మినహా పెద్ద సినిమాలు బరిలో లేవు. మీడియం రేంజ్ సినిమాలకు ఈ సీజన్ లో చాలా స్పేస్ దొరుకుతుంది. కాబట్టి.. తగిన విధంగా ప్లాన్ చేసుకొని, ఈ సమ్మర్ ని క్యాష్ చేసుకొంటే మంచిది.
