దివాలా అంచున ఏపీ..! 4 రోజులా..? 14 రోజులా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో కీలకమైన దశకు చేరుకుంది. దిన దిన గండం నూరేళ్లాయుష్షు అనే పరిస్థితి చాలా కాలంగా ఉన్నప్పటికీ.. గత రెండు నెలల నుంచి పరిస్థితి మరీ టైట్‌గా మారింది. జీతాల కోసం ఆర్బీఐ వద్ద బాండ్ల వేలం వేసిన ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. అవడానికి అప్పు అయిందికానీ ఆ నిధులు రాలేదు. ఇప్పటికే ఓవర్ డ్రాఫ్ట్ ఉండటంతో ఆ అప్పు నిధులను ఆర్బీఐ జమ చేసుకుంది. లోటు కింద కేంద్రం విడుదల చేసిన మరో 1400కోట్ల నిధులనూ అలాగే జమ చేసుకోవడంతో మరిన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు పెండింగ్ జీతాలు.. పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది. రోజువారీ ఆదాయాన్ని వచ్చినంత వరకూ పంపిణీ చేస్తోంది. కానీ ఇప్పటికీ చాలా మందికి వేతనాలు, పెన్షన్లు పడలేదు.

ఆర్బీఐ నుంచి ఏ ప్రభుత్వం తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ ఇంకా రూ. ఎనిమిది వందల కోట్లు చెల్లించాల్సి ఉంది. జీతాలు.. ఇతర అవసరాల కోసం మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లే అవకాశం ఉంది. కానీ..దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓవర్ డ్రాఫ్ట్ అంటే… తాత్కాలికంగా ఆర్థిక అవసరం తీర్చుకునే ప్రక్రియ మాత్రమే. పధ్నాలుగు వందల కోట్ల కన్నా ఎక్కువ ఓడీ తీసుకుంటే నాలుగు రోజుల్లో తిరిగి చెల్లించారు. పధ్నాలుగు వందల కోట్ల కన్నా తక్కువ తీసుకుంటే.. ఆ గడువు పధ్నాలుగు రోజులు. సహజంగా ఆర్బీఐ.. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఓడీ సౌకర్యాన్ని వినియోగించుకుంటే… ఆ రాష్ట్ర ఖాతాలో ఉన్న నిధుల్ని ఆ రోజుల్లోపు మినహాయించుకుంటుంది. దీనికి వడ్డీ కూడా వసూలు చేస్తుంది .. అది వేరే విషయం. ఒక వేళ .. ఆ లోపు.. ఆ రాష్ట్ర ఖాతాలో నిధుల్లేకపోతే ఏం చేస్తుంది..? . ఆ రాష్ట్రం దివాలా తీసినట్లుగా ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఏపీ సర్కార్ ఈ ముంపులోనే ఉంది. ఇప్పటికే ఎనిమిది వందల కోట్లు కట్టాల్సి ఉంది. మళ్లీ ఓడీ తేసుకుంటే.. ఆదాయ మార్గం లేదు.

ఓ వైపు ఏపీ ప్రభుత్వం 41వేల కోట్ల రూపాయల్ని అడ్డగోలుగా తరలించిందని… ఎవరికి చెల్లించారో… కనీసం బిల్లులు కూడా లేకుండా చెల్లించారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సాక్షాత్తూ అకౌంటెంట్ జనరలే ఈ విషయాన్ని లేఖ ద్వారా వెల్లడించారు. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేని పరిస్థితి రావడం.. ప్రభుత్వ పెద్దల్ని కలవర పరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ఏం చేయాలన్నదానిపై వైసీపీలో చర్చలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మనీతో గేమ్స్ అంత మంచిది కాదని ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పెద్దలకు తెలుస్తోందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close