బుచ్చిబాబుకి దొర‌క‌ని వైష్ణ‌వ్ తేజ్‌

సూప‌ర్ డూప‌ర్ హిట్టిచ్చిన డైరెక్ట‌ర్ ఖాళీగా ఉన్నాడంటే ఏంటోలా ఉంటుంది. బుచ్చిబాబుని చూస్తున్నా అదే ఫీలింగ్‌. ఉప్పెన‌తో రూ.50 కోట్ల సినిమా ఇచ్చాడు. వైష్ణ‌వ్ తేజ్ తొలి సినిమాని హిట్ చేసి, త‌న కెరీర్‌కి బాట‌లు వేశాడు. కృతి శెట్టి లాంటి క‌థానాయిక‌ని ఇండ్ర‌స్ట్రీకి అందించాడు. మొత్తానికి అరంగేట్రం అదిరింది. కానీ రెండో సినిమానే ఎంత‌కీ తేల‌డం లేదు. ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ క‌థ రాసుకున్నాడు బుచ్చిబాబు. కానీ ఎన్టీఆర్ కి ఉన్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల ఆ సినిమా ఆల‌స్యం అవుతోంది.

ఈలోగా వైష్ణ‌వ్ తేజ్ తోనే మ‌రో సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాడు. మైత్రీ మూవీస్ లోనే వైష్ణ‌వ్ – బుచ్చి బాబు కాంబో ఖాయమైంది. అయితే ఇప్పుడు వైష్ణ‌వ్ ఫుల్ బిజీ. త‌ను చేసిన `కొండ‌పొలెం` రిలీజ్ కి రెడీ అయ్యింది. ఆ త‌ర‌వాత‌.. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఓ సినిమా చేయాల్సివుంది. బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఇలా రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. వీటి మ‌ధ్య‌.. బుచ్చిబాబుకి డేట్లు ఇవ్వ‌డం క‌ష్టంగా ఉంద‌ట‌. అందుకే.. ఇప్పుడు మ‌రో హీరోని వెదికే ప‌నిలో ప‌డ్డాడు బుచ్చిబాబు. ఓ యంగ్ హీరోతో… బుచ్చి సినిమా త్వ‌ర‌లోనే ఫైన‌ల్ కానుంద‌ని టాక్‌. ఆ హీరో ఎవ‌రన్న‌ది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూ. 14 వేల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో వేస్తారా ? లేదా ?

పోలింగ్ ముగిసింది. ఇప్పుడు గత ఆరు నెలలకు ఏపీ ప్రజలకు ఆపిన పథకాల డబ్బులను ఏపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. పోలింగ్ కు మందు...

అన్నీ తెలుసు కానీ ఈసీ చూడటానికే పరిమితం !

దాడులపై ఇంటలిజెన్స్ నుంచి ముందస్తు సమాచారం ఉందని సీఈవో మఖేష్ కుమార్ మీనా చెప్పుకొచ్చారు. మరి ఎందుకు ఆపలేకపోయారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేకపోయారు. వైసీపీ ఎన్నికల్లో గెలవడానికి ఎంచుకున్న మార్గం.. దాడులు,...

ద్వేషం స్థాయికి వ్యతిరేకత – జగన్ చేసుకున్నదే!

ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేకత ఉంటుంది. అది సహజం. కానీ ద్వేషంగా మారకూడదు. మారకుండా చూసుకోవాల్సింది పాలకుడే. కానీ పాలకుడి వికృత మనస్థత్వం కారణంగా ప్రతి ఒక్కరిని తూలనాడి.. తన ఈగో ...

పల్నాడులో దెబ్బకు దెబ్బ – వైసీపీ ఊహించనిదే !

పల్నాడులో పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి. ఉదయం కాస్త ప్రశాంతంగా పోలింగ్ జరిగినా.. తమకు తేడా కొడుతుందని అంచనాకు రావడంతో మధ్యాహ్నం నుంచివైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close