ప్రకాశం జిల్లా టీడీపీ నేతల జల పోరాటం..!

ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు తమ జిల్లా నీటి వనరుల కోసం సంఘటితంగా పోరాటం చేస్తున్నారు. నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రితో సమావేశమై తమ జిల్లా పరిస్థితిని వివరించారు. అన్యాయం చేయవద్దని కోరారు. కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిలో వెలుగొండ ప్రాజెక్టును చేర్చలేదు. విభజన చట్టంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తావన ఉంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ చూపడంతో ఏఐబీపీ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. తెలంగాణ .. కేంద్రం నిధులు మంజూరు చేయడం చట్ట విరుద్ధమని ఆరోపిస్తూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీంతో టీడీపీ నేతలు వెలిగొండ కోసం పోరాటం ప్రారంభించారు.

నేరుగా కేసీఆర్‌కు లేఖ రాసి ప్రకాశం జిల్లా పొట్ట కొట్టవద్దనికోరిన వారు తర్వాత ఢిల్లీ వెళ్లారు. ఇంతకు ముందు ప్రకాశం జిల్లా నేతలు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై కూడా ప్రకాశం జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అ ప్రాజెక్టు నిర్మిస్తే శ్రీశైలం నుంచి దిగువకు నీరు రావని అదే జరిగితే సాగర్ ఆయుకట్టు కింద చివరిలో ఉండే ప్రకాశం జిల్లా పొలాలకు నీరు అందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అధికార పార్టీగా ఉండటంతో ప్రభుత్వం స్పందించకుండా తాము స్పందిస్తే బాగుండని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం రెండూ ప్రకాశం జిల్లాకు అన్యాయం చేస్తున్నాయని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జిల్లా హక్కుల కోసం తామే పోరాడుతున్నట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపకూడదని .. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని రాజకీయంగా ఎటాక్ చేయాలని నిర్ణయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close