ఆఫ్గాన్ నుంచి పెట్రోల్ ఆగిపోవడం వల్లే రేట్లు పెరుగుతున్నాయట..!

దేశంలో పెట్రోరేట్లది చాలా పెద్ద సమస్య. ఎక్కడికి వెళ్లినా బీజేపీ ప్రజాప్రతినిధులకు ఇదే సవాల్. అందుకే వారు రెడీమేడ్ ఆన్సర్లను వెదుక్కుంటూ ఉంటారు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు దీనికి తాలిబన్లను కారణంగా చెప్పారు. కొందరు చెబుతున్నట్లుగా దేశంలో ఉన్న తాలిబన్ల గురించి కాదు ఆయన చెప్పింది నిజంగా తాలిబన్ల గురించే. అక్కడ వారు ఆఫ్గన్‌ను ఆక్రమించుకోవడం వల్ల సరఫరా అగిపోయిందని అందుకే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని అంటున్నారు. ఆ కర్ణాటక ఎమ్మెల్యే పేరు అరవింద్ బెల్లాడ్.

ఆయన తాలిబన్లను కారణంగా చెప్పి ఆగిపోతే బాగుండేది కానీ ఆయన ఈ విషయం తెలిసని చదువురాని వాళ్లు ఓటర్లు అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడంతోనే దుమారం రేగుతోంది. ” అప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అందు వల్ల ముడి చమురు సరఫరా తగ్గిపోయిందని తెలుసు. అందుకే ఎల్‌పీజీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయని తేల్చేశారు. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు. ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’ అని ఆయన తెగ బాధపడిపోయారు.

బీజేపీ నేతలంతా వాట్సాప్ యూనివర్శిటీ ప్రొఫెసర్లే అని అరవింద్ లాంటివాళ్లు తరచూ నిరూపిస్తూంటారు. పైగా ప్రజలకు ఏమీ తెలియదని దబాయింపులు కూడా. అసలు ఆప్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు చమురు సరఫరానే లేదు. భారత్ ఇరాక్‌, సౌదీ అరేబియా, యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌, నైజిరియా, అమెరికా, కెనడాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఒక్క చుక్క కూడా ఆఫ్ఘన్ నుంచి రాదు. అయినా అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభానికి ముడి పెట్టడం అదీ కూడా ప్రజలకేమీ తెలియదని నిందించే ఘరానా శైలీ బీజేపీ నేతలకు మాత్రమే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close