సాయి ధరమ్‌కి చిన్న గాయాలే..! కానీ

హీరో సాయి ధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఒక్క సారిగా షాక్‌కు గురి కావడంతో అపస్మారక స్థితికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ట్రీట్‌మెంట్ ప్రారంభమైన కాసేపటికే ఆయన స్పృహలోకి వచ్చారు. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యలు చిన్నపాటి ఫ్రాక్చర్లను మాత్రమే గుర్తించారు. అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని అపోలో ఆస్పత్రి వైద్యులు మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూండటం వల్ల పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది.

కేబుల్ బ్రిడ్జిపై సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ జరిగిన వైనంపై సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. హఠాత్తుగా బైక్ స్కిడ్ అయినట్లుగా అందులో ఉంది. బహుశా రోడ్డుపై ఉన్న ఇసుక కారణంగా బైక్ టైర్ స్కిడ్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ట్రయంఫ్ బైక్ ను సాయి ధరమ్ తేజ్ నడుపుతున్నారు. ఆ బైక్ సామర్థ్యంతో పోలిస్తే సాయి ధరమ్ తేజ్ మరీ వేగంగా ఏమీ వెళ్లడం లేదని అర్థం చేసుకోవచ్చు. రాత్రంతా ముగ్గురు వైద్యుల బృందంతో అబ్జర్వేషన్‌లో ఉంచారు. తాజా పరిస్థితిని మెడికల్ బులెటిన్ ద్వారా వెల్లడించనున్నారు.

సాయి ధరమ్ తేజ్ మెగా క్యాంప్ హీరోనే అయిన తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన సామాజిక ఆంశాలపై స్పందిస్తూ ఉంటారు. నలుగురికి సాయం చేయడానికీ ముందు ఉంటారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే గ్రూపులకు అతీతంగా అందరితోనూ సన్నిహితంగా ఉంటారు. ఈ కారణంగా సాయి ధరమ్ తేజ్‌పై అందరికీ మంచి అభిమానం ఉంది. ప్రమాద వార్తతెలియగానే పెద్ద ఎత్తున అటు మెడికర్ ఆస్పత్రికి.. అటు అపోలో ఆస్పత్రికి నటులు.. ఇతర ప్రముఖులు తరలి వచ్చారు.

సాయి ధరమ్‌కు అయిన గాయాల కారణంగా ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడానికి బాగా టైం పట్టే అవకాశం ఉంది. కాలర్ బోన్ ఫ్రాక్టర్స్ తగ్గిపోయినా గతంలోలా డాన్స్‌లు, ఫైట్స్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ మాట్లాడే వీడియోను అపోలో ఆస్పత్రి వర్గాలు ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close