ఈ బుల్లెట్ ఈసారైనా..?

ఆర‌డుగులు బుల్లెట్‌.. ఈ సినిమాని గోపీచంద్ కూడా మ‌ర్చిపోయి ఉంటాడు. కానీ నిర్మాత‌ల‌కు త‌ప్ప‌దు క‌దా..! `మా సినిమాని విడుద‌ల చేస్తాం. చేస్తాం..` అంటూ వీలైన‌ప్పుడ‌ల్లా ఓ ప్ర‌క‌ట‌న ప‌డేసి, ఆ త‌ర‌వాత‌… వాళ్లూ మ‌ర్చిపోతున్నారు. గోపీచంద్ – న‌య‌న‌తార జంట‌గా న‌టించిన సినిమా ఇది. బి.గోపాల్ ద‌ర్శ‌కుడు. మూడేళ్ల క్రిత‌మే విడుద‌ల కావాలి. కానీ ఆర్థిక కార‌ణాల‌తో ఆగిపోయింది. చాలాసార్లు ఈసినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు ఈ బుల్లెట్ ని దించే అవ‌కాశం మ‌రోసారి వ‌చ్చింది. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `సిటీమార్‌` ఈ శుక్ర‌వార‌మే విడుద‌లైంది. తొలి రోజు ఈ సినిమాకి మంచి ఓపెనింగ్సే వ‌చ్చాయి. దాంతో.. ఆర‌గ‌డుగుల బుల్లెట్ నిర్మాత‌ల‌కు కాస్త ధైర్యం వ‌చ్చింది. అక్టోబ‌రులో మా సినిమాని విడుద‌ల చేస్తాం.. అని మ‌రోసారి స‌రికొత్త‌గా ప్ర‌క‌టించారు. ఈలోగా త‌మ ఆర్థిక వ్య‌వ‌హారాల‌న్నీ సెటిల్ అవ్వాలి మ‌రి. అయితే స‌రి. లేదంటే… మ‌రోసారి వాయిదా ప‌డుతుంది. ఈసారి వాయిదా ప‌డితే మాత్రం… నిజంగానే ఈసినిమాని థియేట‌ర్లోకి విడుద‌ల చేసినా – జ‌నం లైట్ తీసేసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close