చైతన్య : హ్యాపీ బర్త్‌డే ! ఎలా చెప్పాలి మోడీజీ !?

” దేశం కోసం ” అని ఆవేశపడి.. గుజరాత్ మోడల్ అభివృద్ధిని చూసి ఆకర్షితుడనై 2014లో బ్యాక్ గ్రౌండ్ గురించి… గోద్రాల గురించి ఆలోచించకుండా బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో ఏక్‌థమ్‌గా మోడీకి మద్దతిచ్చిన వీరభక్తుల్లో నేనొకడ్ని. అప్పట్లో కాంగ్రెస్ గ్యాస్ సబ్సిడీ ఎత్తేసే ప్లాన్‌తో నగదు బదిలీ చేస్తానంటే ఎలా ఖండించారో ఇప్పటికీ నా కళ్లముందు ఉంది. రూపాయి పెట్రోల్ చార్జీలు పెంచితే ఎడ్లబళ్లను వాడిని సీన్లు ఇంకా గుర్తున్నాయి. సామాన్యుల బతుకులపై భారం పడే అలాంటి నిర్ణయాలు మోడీ తీసుకోరని గట్టిగా అనుకున్నారు. అందుకే ఆయన పుట్టిన రోజునూ ఎప్పుడూ తక్కువగా సెలబ్రేట్ చేయలేదు. ఎక్కువగా చేస్తూనే ఉన్నారు. కానీ మొదటి ఏడాది చేసిన ఉత్సవాలు.. రెండో ఏడాది.. ఆ తర్వాత ఏడాదికి.. తగ్గుతూ వస్తున్నాయి . ఇప్పుడు పూర్తిగా నీరసం వచ్చేసింది. ఈ ఏడాది పుట్టిన రోజును గుర్తు చేసుకోవడానికి ఆసక్తి లేకుండా పోయింది. ఎందుకిలా అయిందో కాస్త ఆలోచిస్తే… చాలా చాలా అర్థం అవుతోంది.

నిన్ననే గ్యాస్ బుక్ చేద్దామని చూస్తే రూ. వెయ్యి చూపించింది రేటు !

గ్యాస్ బుక్ చేద్దామ నిన్ననే యాప్ ఓపెన్ చేస్తే ఆ సిలిండర్ రేటు చూసి నీరసం వచ్చేసింది. అటూ ఇటూగా రూ. వెయ్యి లెక్క కనిపించింది. ఆరేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీని హఠావో చేసినప్పుడు అది నాలుగు వందలు మాత్రమే. అప్పుడు సబ్సిడీ ఎత్తేసి బ్యాంకులే వేస్తామని వారు అంటే మోడీ చేసిన పోరాటం ఆకర్షించింది. ఆయన వస్తే రేట్లు పెరగవని అనుకున్నారు. కానీ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఆ రేటు చూస్తే రూ. వెయ్యి అయింది. అంటే దాదాపుగా రెండింతలు అయింది. కానీ నా జీతం ఆదాయం మాత్రం ఆరేళ్లతో పోలిస్తే పది శాతం కూడా పెరగలేదు సరి కదా కోవిడ్ దెబ్బకు ఎప్పుడు జీతాలొస్తాయో తెలియని పరిస్థితికి వచ్చేసింది. నెలక్కు ఒక్క గ్యాస్ కోసమే వెయ్యి రూపాయలు పెట్టాలంటే మాలాంటి మధ్య తరగతి జీవికి సాధ్యమేనా. పోనీ సబ్సిడీ ఇస్తున్నారుగా అని సర్దుబాటు చేసుకుందామంటే అది మరింత అవమానకరం… రూ. పదిహేను సబ్సిడీ బ్యాంక్ అకౌంట్‌లో పడుతోంది. అందుకే హ్యాపీ బర్త్‌డే చెప్పాలి అనిపించినా గ్యాస్ గుర్తుకు వచ్చి.. నీరసం వచ్చేసింది.

ఒక్క గ్యాసేనా … ఆఫీసుకు బయలుదేరుదామని బండి తీస్తే నిస్సత్తువే !

ఆఫీసుకు పోవాలంటే కనీసం పదిహేను కిలోమీటర్లు జర్నీ చేయాలి. అలా చే్యాలంటే రోజుకు అప్ అండ్ డౌన్ లీటర్ పెట్రోల్ పోయించాల్సిందే . ఇది ఒక్క నా సమస్య కాదు. 90 శాతం మంది మధ్యతరగతి ప్రజల సమస్య. ఆరేళ్ల కిందట పెట్రోలు రేటు ఎంత..?ఇప్పుడు ఎంత పోల్చుకుంటే .. నా మీద నాకే కోపం వస్తుంది. ఆరేళ్ల కిందట నా జీతం ఎంత.. ఇప్పుడు జీతం ఎంత పోల్చుకుంటే అసహ్యం కూడావేస్తోంది. పెట్రోల్‌తో పాటు కూడాకనీసం జీతం పెరగలేదు. అప్పట్లో 70 రూపాయలు పెట్రోలు రేటు ఉంటేనే భూమి, ఆకాశం బద్దలయ్యేంతగా ఆందోళన చెందా. ఇక కుటుంబానికి తిండి ఎలా పెట్టాలని కంగారు పడ్డారు. అప్పుడే మీరు.. స్మృతి ఇరాని బీజేపీ నేతలు పెట్రోల్ ధరలు పెరిగితే మధ్య తరగతిపై ఎలాంటి ప్రభావం పడుతుందో విశ్లేషిస్తూ నిరసనలు చేపట్టారు. అందుకే తగ్గించకపోయినా.. పెంచరనే ధైర్యంతో హ్యాపీ బర్త్ డేలు జరిపాను. కానీ ఇప్పుడు పెట్రోల్ రేటు చూస్తే రూ. 110 అయింది. అంటే నెలకు నాలాంటివాడు రూ. మూడు వేల రూపాయలు పెట్రోల్‌ కు పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ నేను అంటే 90 శాతం మంది మధ్యతరగతి జీవులని అర్థం చేసుకోండి.

నిత్యావసర వస్తవుల ధరలు అయినా తగ్గాయా అంటే ప్రతీ నెలా షాకే !

నిత్యావసరవస్తువుల ధరలు ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా పెరిగితే .. దానికి తగ్గట్లుగా జీతాలు పెరుగుతాయి కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ రూ. 70 ఉండే లీటర్ వంట నూనే వంద దాటిపోతే ఏ మధ్య తరగతి వాడైనా ఏం చేస్తాడు..? నెలల తరబడి పెరిగిన రేట్లు అలాగే ఉంటున్నాయి.. కానీ త్వరలో రేట్ల తగ్గంపు అనే ప్రకటనలు చూస్తూంటే అప్పుడప్పుడు జై మోడీ అనాలని అనిపిస్తుంది. కానీ ఎందుకో తగ్గిన తర్వాత అనొచ్చులే అనే నిస్సత్తవు ఆవరిస్తోంది. మధ్య తరగతి కుటుంబ జీవనం ఖర్చు ఆరేళ్లలో రెండింతలు అయిందనేది కాదనలేని వాస్తవం. హ్యాపీ బర్త్ డే అని బిగ్గరగా అరవాలని అనుకున్నప్పుడు ఈ బిల్లులే గుర్తొచ్చి నీరసం ఆవహించేస్తోంది.

సామాన్యుడ్ని మోడీజీ కాస్త కనికరించండి !

ఆరేళ్ల క్రితం మీరు మధ్య తరగతి జీవులకు ఆపద్భాంధవుడిగా కనిపించారు. అలా మీ ప్రచారం చేశారో… లేకపోతే అప్పటికష్టాల్లో అలా కనిపించేలా చేశారో కానీ అందరికీ అంతే . కానీ ఇప్పుడు మాత్రం అప్పటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితులు దిగజారిపోయాయని నా లాంటి వాళ్లకు అనిపిస్తోంది. అప్పుడప్పుడు దేశం కోసం.. ధర్మం కోసం అని నన్ను నేను సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా… బతుకు దుర్భరమవుతున్న కొద్దీ కోపం ముంచుకొస్తోంది. మోడీజీ ఆరేళ్ల క్రితం ఎగిరి గంతేసి పుట్టిన రోజు జరుపుకున్నాం.. ఇవాళ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాం..! అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో కాస్త ఆలోచించి.. కనికరించండి మోడీ జీ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close