అలా అడిగినప్పుడు ఏడుపు వచ్చేది: అదితిరావు హైదరితో ఇంటర్వ్యూ

బాలీవుడ్ నుంచి సౌత్ లోకి అడుగుపెట్టింది అదితిరావు హైదరి. చెలియా, నవాబ్ సినిమాలతో మణిరత్నం హీరోయిన్ అనే బ్రాండ్ తెచ్చుకుంది. ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వి’ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు మహాసముద్రంతో ప్రేక్షకులముందుకు వస్తుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, అదితి, సిద్దార్ద్ కలసి నటించిన ఈ సినిమా ఈవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా అతిది పంచుకున్న మహాసముద్రం ముచ్చట్లు..

మహాసముద్రంలో మీ పాత్ర గురించి ?
ఇందులో ‘మహా’ అనే పాత్రలో కనిపిస్తా. పాత్ర చాలా నచ్చింది. మహా పాత్ర కధలో చాలా కీలకం. ఆ పాత్రలో కనిపించడం నాకూ కొత్త అనుభూతి.

కథ చెప్పినపుపడు ఎలా ఫీలయ్యారు ?
అజయ్ భూపతి ఆర్ ఎక్స్ 100చూశా. ఆయన వర్క్ చాలా నచ్చింది. మహాసముద్రం కథ చెప్పినపుడే చాలా ఎక్సయిటింగా అనిపించింది. అజయ్ భూపతి చాలా మంచి ఫిల్మ్ మేకర్. ఆయన కథ చెప్పే విధానం చాలా బలంగా వుంటుంది. నిజానికి ఈ కథ రెండేళ్ళ కిత్రం చెప్పారు. మహా పాత్రని నాతోనే చేస్తానని చెప్పారు. రెండేళ్ళలో కథలో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. అయితే అజయ్ మాత్రం ప్రతి రెండు నెలలకోసారి ఫోన్ చేసి మార్పులు చేర్పులు చెప్పేవారు. ఎట్టి పరిస్థితిలో మహా పాత్రని మీరే చేయాలని అడిగేవారు. అజయ్ ప్యాషన్ చూస్తే ఏడుపు వచ్చేసేది. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాని ప్రేమించే దర్శకుడు అజయ్ భూపతి.

అంటే అజయ్ మీకు అభిమానా ?
హహ.. కాదు. ఆయన సినిమా అభిమాని. ఆయన రాసుకున్న పాత్రకి అభిమాని.

మహా సముద్రం ట్రైయాంగిల్ లవ్ స్టొరీనా ?
అది ఇప్పుడు చెప్పకూడదు. 14వ తేదిన మహాసముద్రం కథ అందరికీ ఒకేసారి చెబుతాం. థియేటర్ లో.

మహా సముద్రం హీరోయిన్ సెంట్రిక్ మూవీనా ?
కాదు. చాలా పెద్ద స్టార్ కాస్ట్ వున్న సినిమా. అద్భుతమైన పాత్రలు వున్నాయి. అయితే మహా పాత్ర చుట్టూ జరిగే కథ ఇది. ఇందులో ప్రేమ, స్నేహం.. అన్నీ వుంటాయి.

శర్వానంద్, సిద్దూ గురించి ?
శర్వానంద్ చాలా మంచి నటుడు. ప్రతి పాత్రని సెటిల్ గా చేస్తారు. ఆయన క్యారెక్టర్ అర్ధం చేసుకునే తీరు బావుటుంది. సిద్ధార్ద్ మణిరత్నం సర్ స్టూడెంట్. నటనే కాదు నిర్మాత, రైటర్, సింగర్, కంపోజర్.. చాలా కోణాలు వున్నాయి. చాలా ప్రతిభ గల టీం తో పనిచేయడం మంచి అనుభూతి ఇచ్చింది.

అజయ్ భూపతితో పని చేయడం ఎలా అనిపించింది ?
అజయ్, రాం గోపాల్ వర్మ స్టూడెంట్. నేను, సిద్దార్డ్, శరణ్య .. ముగ్గురం మణిరత్నం స్టూడెంట్స్. ఇలాంటి నలుగురం కలసి వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్. ఎక్కవ సినిమా గురించే మాట్లాడుకునే వాళ్ళం.

బయోపిక్ చేయాలనే ఆలోచన ఉందా ?
వుంది. నేను రేఖ గారికి పెద్ద ఫ్యాన్ . ఆమె బయోపిక్ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా.

కొత్తగా ఏం సినిమాలు చేస్తున్నారు ?
దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తున్న. హిందీలో విక్రమ్ ఆదిత్యతో ఓ సినిమా. ఇంకొన్ని సినిమా వున్నాయి. నిర్మాతలు, దర్శకులు ప్రకటిస్తారు.

అల్ ది బెస్ట్
థ్యాంక్ యూ…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close