ప్రతిపక్షంలో అలా.. అధికారంలో ఇలా ! ప్రజలంటే అంత అలుసా ?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వరద బాధితుల కష్టాలు హైలెట్ అవుతున్నాయి. నెల్లూరులో జిల్లాలో ఓ మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్‌ను సైతం బాధితులు తరిమికొట్టిన వైనం ఇప్పుడు వైరల్ అవుతోంది. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం కనీస మాత్రం చర్యలు తీసుకోలేదు. వరదలు వచ్చే ముందు తీసుకోలేదు.. దాని వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వరదలు వచ్చిన తర్వాతా తీసుకోలేదు. దాని వల్ల బాధితులు రోడ్డున పడ్డారు. సర్వం కోల్పోయిన వారికి రూ. వెయ్యి చేతిలో పెట్టారు. కింది స్థాయి అధికారులు.. వాలంటీర్లు తప్ప ఎవరూ బాధితుల వైపు చూడటం లేదు.

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బస్సు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే హుటాహుటిన వాలిపోయేవారు. కాబోయే ముఖ్యమంత్రిని మీ సంగతి తేలుస్తా అని అధికారులను హెచ్చరించేవారు. మన ప్రభుత్వం రాగానే మీ అందరికీ సాయం చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చేవారు. ఇలా ప్రమాదాలు.. విపత్తులు సహా ప్రతీ వాటికి వెళ్లేవారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన వారికి ఎకరాలకు రూ. ముఫ్పై వేలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ అసలు బాధితుల వద్దకే వెళ్లడం లేదు.

సొంత జిల్లా కడప ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఆయన కనీసం మనో ధైర్యం ఇవ్వడానికి వెళ్లలేకపోయారు. ఏరియల్ సర్వే చేసి సరి పెట్టారు. ఈ లోపు ప్రతిపక్ష నేతలంతా వెళ్లారు. నిజానికి ఏ ప్రభుత్వమైనా.. ముఖ్యమంత్రైనా ముందుగా బాధితులకు ధైర్యం ఇచ్చేందుకు వెళ్తారు. ఆ తర్వాత ప్రభుత్వ సాయం సరిగ్గా ఇవ్వలేదనో..మరొకటో రాజకీయం చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి విపక్షాలు వెళ్తాయి. కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పిన దాంట్లో.. చేసిన దాంట్లో ఒక్కటంటే ఒక్క శాతం కూడా చేయడం లేదు.

ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత తక్కువగా అంచనా వేసుకుంటున్నారో వైసీపీ నేతలకూ అర్థం కాని పరిస్థితి . కులం పేరుతో రెచ్చగొడితే చివరికి వారు ఓట్లు తనకే వేస్తారని భావమో లేకపోతే.. ఏం చేసినా తనను నెత్తి మీద పెట్టుకుంటారన్న నమ్మకమో ..ఉందని భావిస్తున్నారు. ఆ కొద్ది మంది బాధితులు తనకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదని అనుకుంటున్నారో కానీ మొత్తానికి ప్రభుత్వం తన బాధ్యతల్ని పూర్తిగా విస్మరించిందనే అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close