బీజేపీని గంట తిట్టి “ధాన్యం భారం” దించేసుకున్న కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత అందులో తీసుకున్న నిర్ణయాలపై ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం బీజేపీని తి‌ట్టడానికే ప్రెస్‌మీట్ పెట్టినట్లుగా ఉంది. తన గంటన్న ప్రెస్‌మీట్ సారాంశం మొత్తం సింగిల్ పాయింట్‌లో చెప్పాలంటే.. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు ఎవరైనా పండించుకున్నా ఎవరికి వారు అమ్ముకోవాలి. ఇది చెప్పాల్సిన మాట సూటిగా చెప్పారు కానీ.. ఇదంతా బీజేపీ వల్లే అని చెప్పడానికి మిగతా సమయం అంతా కేటాయించారు. బీజేపీని చెడా మడా తిట్టేశారు.

ఢిల్లీకి వెళ్తే బిచ్చగాళ్లలాగా చూస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డిని చేతకాని దద్దమ్మగా అభివర్ణించారు. బీజేపీ రైతు హత్యల ప్రభుత్వంగా మాట్లాడారు. తన ప్రసంగంలో 90 శాతం బీజేపీని విమర్శించడానికే సరిపోయింది. వరి పండించవద్దని అనుకుంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ప్రకటించి.. వాటికి మద్దతు ధర ఇస్తే ఎక్కువ మంది పాటిస్తారని అంచనా వేశారు. కానీ కేసీఆర్ తన ప్రెస్మీట్‌లో ప్రత్యామ్నాయ పంటల గురించే చెప్పలేదు. దీంతో రైతుల్లో విస్మయం అవుతుంది. మొత్తంగా చూస్తే వచ్చే యాసంగిలో వరి ధాన్యం కొనే పరిస్థితి లేదు.

ఈ వైఫల్యాన్ని బీజేపీకి అంటించేందుకు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాలకు కేసీఆర్ .. ఫినిషింగ్ టచ్ ఇచ్చారనుకోవాలి. కానీ బీజేపీ నేతలు మాత్రం తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. ఈ సారి ప్రెస్ మీట్ విశేషం ఏమిటంటే బండి సంజయ్ నుంచి లైట్ తీసుకుని.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం. కేసీఆర్ టార్గెట్ చేయడం ల్ల బండి సంజయ్‌కు ఫోకస్ వచ్చింది. ఈ సారి కిషన్ రెడ్డికి చాన్సిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇక నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ బంద్… ఎందుకంటే..?

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇక నుంచి టీకాను ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన టీకాలు అందుబాటులోకి వచ్చినందున ఇక తమ వ్యాక్సిన్ అవసరం లేదని...

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close