సీబీఐ అధికారులపై రివర్స్ కేసుల బ్లాక్‌మెయిలింగ్ !?

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో సీబీఐ ఉన్నతాధికారులకు ఇప్పటికి ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే రివర్స్ కేసులకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎవరికీ తెలియని ఓ వ్యక్తి .. అదీ కూడా సీబీఐ అరెస్ట్ చేసిన నిందితుడిగా ప్రధాన అనుచరుడిగా చెప్పుకుని కూడా స్వయంగా పోలీసులు, సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేస్తే .. ఆయనను వీఐపీగా పరిగణించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆయనకు ఎస్పీ ఇలా అపాయింట్‌మెంట్ ఇవ్వడం.. మీడియాకు సమాచారం ఇవ్వడం తర్వాత ఆయన ఫిర్యాదుపై వెంటనే ఎస్పీ కూడా స్పందించడం చకచకా జరిగిపోయాయి.

ఇలా ఆ వ్యక్తి ఫిర్యాదు చేయగానే అలా డీఎస్పీతో తమ శాఖకు చెందిన ఓ సీఐపై విచారణకు ఆదేశించడమే కాదు.. సీబీఐ అధికారులపైనా దర్యాప్తు చేయబోతున్నట్లుగా తేల్చేశారు. మీడియాతో మాట్లాడిన తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తిని సీఐ స్థాయి అధికారే జాగ్రత్తగా తీసుకెళ్లారు. బహుశా… ఆయన అడిగిన విధంగా రక్షణ కల్పించి తీసుకెళ్లి ఉంటారు. సీబీఐ అధికారులపై ఓ ప్రణాళిక ప్రకారం… చేస్తున్న కుట్రగా సాధారణ ఆలోచనలు ఉన్న వారికీ అర్థమవుతుంది. సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని, దేవిరెడ్డి శంకర్ రెడ్డిని నిందితులుగా తేల్చడానికి రూ.కోట్లు వెదజల్లడానికి సిద్ధమయ్యారన్న ఫిర్యాదే ఆశ్చర్యకరం. దానికి పోలీసులు స్పందించిన తీరు మరింత అనూహ్యం.

సీబీఐ అధికారులు దర్యాప్తులో దూకుడు తగ్గించకపోతే వారిపైనా ఎదురు కేసులు పెడతామన్నట్లుగా ఇప్పుడు ఏపీ పోలీసుల ద్వారానే పంపాల్సిన సంకేతాలు పంపారన్న అనుమానాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. ఇది ఫలించిందేమో కానీ.., ఆరు రోజుల కస్టడీకి తీసుకున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు .. ఇక ప్రశ్నించింది చాలని నాలుగు రోజులకే కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రివర్స్ కేసుల వ్యూహం వర్కవుట్ అయినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. కొన్నాళ్లు వైసీపీ అనుబంధ పత్రికలో వైఎస్ వివేకాకు దురలవాట్లు ఉన్నాయని.. సెటిల్మెంట్ల గొడవల్లోనే హత్య జరిగిందన్న ప్రచారం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రచారం చేస్తున్నారు.

న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె, అల్లుడిపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటితో బ్లాక్ మెయిలింగ్, బురద చల్లడం ద్వారా ఎదుటి వ్యక్తిని ఆత్మరక్షణలో పడేసి.. తప్పించుకునే వ్యూహంలో నిందితులు ఉన్నారని.. దాని కోసం అధికారం వినియోగిచుకుటున్నారన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. అయితే సీబీఐ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే… కుట్ర మొత్తం బయటపడుతుంది. భయపడి వెళ్లిపోతే.. సీబీఐపై నింద అలాగే ఉండిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close