“అమరావతి”తో మళ్లీ పొలిటికల్ గేమ్స్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ మళ్లీ అమరావతితో రాజకీయ ఆటలు ప్రారంభించింది. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం.. సీఆర్డీఏను పునరుద్ధరించడంతో అభివృద్ధి చేయకోయినా… కనీసం ఉన్నది ఉన్నట్లుగా అయినా ఉంచుతారేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాజధానిలోని కొన్ని గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం విాదాస్పదమవుతోంది.

రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయాలని నిర్ణయించారు. సీఆర్డీఏ చట్టంలో 29 రెవెన్యూ గ్రామాలను రాజధాని ప్రాంతంగా పేర్కొన్నారు. కానీ 19 గ్రామాలతోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారట. మరో పది గ్రామాలు ఏమయ్యాయి అంటే… వాటిని విడిగా మరో కార్పొరేషన్‌లో కలుపుతున్నారు. గత ఏడాది మార్చిలోనే మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్టీల తోపాటు మరో 21 గ్రామాలను కలిపి కార్పొరే షన్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో వీటిని కలిపారు. గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గతంలో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మున్సిపాల్టీకి అప్పటి వరకు ఎన్నికలు జరగలేదు.

ఐదు లక్షల జనాభా దాటి న తర్వాత మునిసిపల్‌ ప్రాంతాన్ని కార్పొ రేషన్‌గా ఏర్పాటు చేస్తారు. 10 లక్షల జనాభా దాటితే దానిని మహా నగర పాలకసంస్థగా అప్‌గ్రేడ్‌ చేస్తా రు. మంగళగిరి, తాడేపల్లిలో ప్రస్తుతం రెండు, మూడు లక్షలకు మించి జనాభా లేరు… అలాగే రాజధాని పరిధిలోని పందొమ్మిది గ్రామాల్లోనూ కలిపి లక్షకు మించి జనాభా ఉండరు. అయినా కార్పొరేషన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చారు. అంటే సీఆర్డీఏ ఒక్కటే కానీ కార్పొరేషన్లు మాత్రం రెండు. మాస్టర్ ప్లాన్ మార్చవద్దని హైకోర్టు పదే పదే చెబుతున్నా ఎందుకు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని రైతులు, న్యాయనిపుణులు అంటున్నారు.

అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే వివాదాల జోలికి వెళ్లకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారం 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ చేసేవారు. కానీ ప్రభుత్వ ఉద్దేశం వివాదాల్లోకి నెట్టడమేనని అందుకే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...
video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close