విడాకులు తీసుకోవ‌డం.. అత్య‌త్త‌మ నిర్ణ‌య‌మే!

నాగ‌చైత‌న్య – స‌మంత విడాకుల వ్య‌వ‌హారం 2021లోనే టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీ అయ్యింది. ఈ వ్య‌వ‌హారం చుట్టూ ఎన్ని క‌థ‌లు, ఇంకెన్ని క‌థ‌నాలో..? ఇప్పటికీ ఏదో ఓ రూపంలో చై – శామ్ విడాకుల గురించిన చ‌ర్చ వ‌స్తూనే ఉంది. అయితే.. విడాకులు తీసుకున్న త‌ర‌వాత‌. అటు స‌మంత గానీ, ఇటు నాగ‌చైత‌న్య గానీ మీడియా ముందుకు రాలేదు. ఇంట‌ర్వ్యూలూ గ‌ట్రా ఇవ్వ‌లేదు. అయితే.. ఈసారి `బంగార్రాజు` ప్ర‌మోష‌న్ల‌లో నాగ‌చైత‌న్య ఈ వ్య‌వ‌హారంపై పెద‌వి విప్ప‌క త‌ప్ప‌లేదు. `ప‌ర్స‌న‌ల్ క్వ‌శ్చ‌న్స్ వ‌ద్దు..` అని పీఆర్వోలు రిపోర్ట‌ర్ల‌ని ముందే ఎలెర్ట్ చేసినా, విడాకులకు సంబంధించిన ప్ర‌శ్న వ‌చ్చేసింది. `వీడాకుల‌నేవి మీ జీవితంలో క‌ఠిన‌మైన నిర్ణ‌య‌మా?` అనే ప్ర‌శ్న‌కు చై ఆచి తూచి స‌మాధానం ఇచ్చాడు. ఇద్ద‌రి మంచి కోరి తీసుకున్న నిర్ణ‌య‌మే అని, విడాకుల వ‌ల్ల ఇద్ద‌రూ సంతోషంగా ఉన్నామ‌ని, ఆ స‌మ‌యంలో ఇదే అత్యుత్త‌మ నిర్ణ‌య‌మ‌ని వెల్ల‌డించాడు చైతూ. ఈ విష‌యంలో కుటుంబ స‌భ్యులు ఎంతో స‌హ‌క‌రించార‌ని చెప్పుకొచ్చాడు. నాగార్జున‌, నాగ‌చైత‌న్య క‌ల‌సి నటించిన `బంగార్రాజు` శుక్ర‌వారం విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కృతిశెట్టి క‌థానాయిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close