మీడియా వాచ్ : రేటింగ్‌ల వివాదం.. టీవీ9 ఔట్ !

టీఆర్పీ రేటింగ్‌లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన టీవీ9 గ్రూపు.. తమ తప్పులు ఎక్కడ బయటపడతాయో.. లేకపోతే ఇండస్ట్రీ వర్గాలు.. అసోసియేషన్లు ఎక్కడ చర్యలు తీసుకుంటాయోనని ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. ముందు జాగ్రత్తగా బెదిరింపు ధోరణిలో తాము బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటన చేశారు. టీవీ9 గ్రూపు సీఈవో ఈ మేరకు సంఘానికి బహిరంగ లేఖ రాశారు. మామూలుగా ఏదైనా అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తేల్చుకుంటారు. ఇక్కడ టీవీ9 మాత్రం భిన్నమైన దారి ఎంచుకుంది.

న్యూస్ చానల్స్ కు రేటింగ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ భావించడం సరి కాదని.. ఆయనంటున్నారు. ఏడాదిగా రేటింగ్స్ లేకపోవటంతో న్యూస్ చానల్స్ ఆదాయం, విశ్వసనీయత దెబ్బతిన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రేటింగ్స్‌ ను తక్షణం అమల్లోకి తేవాలని కేంద్రం ఆదేశించింది. అయితే న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది. అక్రమాలు తేలాలని.. పట్టుబడుతోంది. ఆ తర్వాత అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఇది టీవీ9 గ్రూపునకు నచ్చలేదు. ఇప్పటికే న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ టీవీ9 భరత్ వర్ష్ చేసిన రేటింగ్స్ రిగ్గింగ్ మీద స్వయంగా ఫిర్యాదు చేసిది.ఈ వైఖరికి నిరసనగా సంఘంలో ఉన్న పూర్తి స్థాయి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తమ నెట్ వర్క్ తప్పుకుంటున్నదని స్పష్టం చేశారు. తమ సభ్యత్వ రుసుములో మిగిలిన మొత్తాన్ని సంఘం నియమాలకు అనుగుణంగా వాపస్ చేయాలని కూడా టీవీ 9 గ్రూపు కోరుతోంది. ఇది టీవీ9 అనైతిక చర్యలకు పాల్పడి .. చర్యలు తీసుకుంటామోనన్న భయంతో చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌గా మీడియా వర్గాలు భావిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close