తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా అన్ని రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసింది. ఇందులో ఏపీకి అయితే ఈ సారి రూ. 3,847.96 కోట్లు లభించాయి. కానీ తెలంగాకు మాత్రం రూ. 1,998.62 కోట్లు మాత్రమే దక్కాయి. అయితే ఈ మొత్తం రెండు నెలల పన్నుల వాటా. వచ్చే నెలది కూడా కేంద్రం ముందుగా ఇచ్చేసింది.

సాధారణంగా నెలకు పన్నుల వాటా కింద కేంద్రం ఏపీకి రూ. 1,923.98 కోట్లు .. తెలంగాణకు నెలకు రూ. 999.31 కో ట్లు ఇస్తుంది. ఇలా చూసినా తెలంగాణ కంటే ఏపీకి దాదాపుగా రెట్టింపు వస్తుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఏపీకి ఆదాయం తక్కువ కాబట్టి.. అదే విధంగా లోటు ఉన్న రాష్ట్రాల పట్ల కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి పన్నుల వాటా ఎక్కువ వస్తుంది. అయితే రాష్ట్ర పాలకులే ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ తీసుకోకపోవడంతో సమస్యలు వస్తున్నాయి.

ఏపీ పట్ల కేంద్రం ఎప్పుడూ చల్లని చూపే చూస్తోంది. వచ్చే నెల పన్నుల వాటాను కూడా ముందుగానే ఇవ్వడం వల్ల చాలా వరకు ఈ నెలసమస్యల నుంచి ఏపీ ప్రభుత్వం బయటపడనుంది. ఈ నెల జీతాలను.. ఇప్పటి వరకూ ఇస్తూనే ఉన్నారు. వచ్చే నెల జీతాలకు మాత్రం ఎలాంటి సమస్య లేకుండా.. రెండు నెలల పన్నుల వాటా రావడంతో సమస్య పరిష్కారమయిటన్లవుతుంది. మరి వచ్చే నెల పన్నుల వాటా రాదు.. అప్పుడేం చేస్తారంటే.. .చేయడానికేముంది.. అప్పులే అనే సమాధానం రెడీగా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close