మారుతి ‘ఇంటింటి రామాయ‌ణం’

అటు సినిమా, ఇటు ఓటీటీ.. ఈ రెండింటిపైనా దృష్టి పెడుతున్నారు ఈత‌రం ద‌ర్శ‌కులు. ఈ వ‌రుస‌లో మారుతి ముందుఏ ఉంటారు. `త్రీ రోజెస్‌` పేరుతో మారుతి నుంచి ఓ వెబ్ సిరీస్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో వెబ్ సిరీస్‌కి రంగం సిద్ధ‌మైంది. `ఇంటింటి రామాయ‌ణం` పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు మారుతి. ఇది ఆహా కోసం. మారుతి ఈ వెబ్ సిరీస్ కి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. స్క్రిప్టు విష‌యంలోనూ ఆయ‌న‌దే హ్యాండ్‌. ఆహాలో వ‌రుస‌గా మూడు వెబ్ సిరీస్‌లుచేయాల‌న్న‌ది ఒప్పందం. త్రీ రోజెస్ తో ఒక‌టి అయిపోయింది. ఇప్పుడు `ఇంటింటి రామాయ‌ణం`. త్వ‌ర‌లోనే మ‌రో వెబ్ సిరీస్‌కీ మారుతి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ఈ రెండు వెబ్ సిరీస్‌ల‌కూ మారుతి ద‌గ్గ‌ర స‌హాయ‌కులుగా ప‌నిచేసిన వాళ్లే ద‌ర్శ‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. మారుతి `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` విడుద‌కు సిద్ధ‌మైంది. రిలీజ్ డేట్ ఇంకా తేల‌లేదు. మ‌రోవైపు ప్ర‌భాస్ కోసం ఆయ‌న ఓ క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close