‘కృష్ణ వ్రింద విహారి’ టీజ‌ర్‌: కూల్ & రొమాంటిక్‌…!

‘ఛ‌లో’ తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టాడు నాగ‌శౌర్య‌. త‌ర‌వాత తాను కొన్ని మంచి క‌థ‌లు ఎంచుకొన్నా.. స‌రైన ఫ‌లితాలు మాత్రం రాలేదు. ఓర‌కంగా… త‌ను ఓ హిట్టు బాకీ ప‌డిపోయాడు. ఇటీవ‌ల చేసిన `వ‌రుడు కావ‌లెను` మంచి ఫ‌లితాన్నే రాబ‌ట్టింది. అందుకే మ‌రోసారి త‌న‌కు బాగా అచ్చొచ్చిన రొమాంటిక్ యాంగిల్‌లోకి వెళ్లిపోయాడు. త‌న కొత్త సినిమా `కృష్ణ వ్రింద విహారి`. అలా – ఎలా తో ఆక‌ట్టుకొన్న అనీష్ కృష్ణ ద‌ర్శ‌కుడు. షెర్లీ సెటియా క‌థానాయిక. ఇప్పుడు టీజ‌ర్ విడుద‌లైంది.

నాగ‌శౌర్య మ‌రోసారి రొమాంటిక్ లుక్‌లో.. క్లాసీ స్టైల్‌తో క‌నిపించాడు. అమ్మాయిని చూడ‌గానే, గుండెల్లో గంట కొట్టుకోవ‌డం, ఆ అమ్మాయి వెనుక ప‌డ‌డం… త‌న‌ని ఫ్ల‌ట్ చేయ‌డం, రొమాంటిక్ సీన్స్‌.. ఇవ‌న్నీ కూల్‌గా ఉన్నాయి. మ‌హ‌తి విద్యాసాగ‌ర్ ఇచ్చిన బీజియ‌మ్ హాయిగా.. ఆహ్ల‌ద‌క‌రంగా ఉంది. చివ‌ర్లో డైలాగ్ కూడా.. ఫ‌న్నీగా ఉంది. `పెళ్లి చేసుకొందాం సినిమాలో సౌంద‌ర్య‌లా నీకేమైనా సెక్సువ‌ల్ ఎబ్యూజ్ జ‌రిగిందా? ఫ‌ర్లేదు నిన్ను వెంక‌టేష్ కన్నా బాగా చూసుకొంటా` అనే డైలాగ్ బాగా పేలింది. దాన్నిశౌర్య చెప్పిన విధానం కూడా బాగుంది. వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, బ్ర‌హ్మాజీలు ఉన్నారు కాబ‌ట్టి.. కామెడీకి ఢోకా లేన‌ట్టే. పైగా ఇది శౌర్య త‌న సొంత బాన‌ర్ లో చేస్తున్న సినిమా. కాబ‌ట్టి ఖ‌ర్చుకి వెనుకాడ‌లేదు. అనిష్ కృష్ణ‌కూడా కామెడీని బాగా డీల్ చేస్తాడు. మొత్తానికి ఓ మంచి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని చూడ‌బోతున్నాం అనే సంకేతాల్ని పంపింది ఈ టీజ‌ర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.