తెలకపల్లి రవి : తెలుగు రాష్ట్రాలంటే ఆ నలుగురేనా?

Telakapalli-Raviఆ నలుగురు… ఎవరు ? తెలుగు రాష్ట్రాలలో ఆర్థిక రాజకీయ పరిణామాలను అమితంగా ప్రభావితం చేస్తున్న అత్యంత శక్తివంతులు.. విమర్శించుకున్నా ప్రశంసించుకున్నా ఆలింగనాలు చేసుకున్నా కారాలు మిరియాలు నూరుకున్నా.. అంతిమంగా వారి మాటే చెల్లించుకుంటారు. అధికారం, సంపదలూ పంచుకుంటారు ..ఇది ఒక ఆరెస్సెస్‌ బిజెపి నాయకుడి ఆవేదన. ఆగ్రహం కూడా. ఇంతకూ ఎవరా నలుగురు..?

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పగల అతికొద్ది మందిలో ఒకరైన సీనియర్‌ తెలుగు నేత, రెండు తెలుగు రాష్ట్రాలనూ శాసించే ఇద్దరు సర్వాధినేతలు ,మీడియా రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందే ఒక పెద్ద .. ఇదీ ఇష్ట చతుష్టయం అని ఆ అసలు సిసలు ఆరెస్సెస్‌ వాది చెబుతున్న విషయం.

రాజకీయాల్లో మునిగితేలుతున్నట్టు కనిపించే వీరికి వ్యాపార సామ్రాజ్యాలతో బలీయమైన సంబంధాలున్నాయి. ఆధ్యాత్మిక అనుబంధాలున్నాయి. అధికార వ్యవస్థలో తిరుగులేని పట్టు వుంది. వీరు అనుకున్నదే జరుగుతుంది. లేకుంటే జరక్కుండా చేస్తారు. తాము అనుకున్నది జరిగే వరకూ ఆపేయించగలరు. లెక్కలు కుదరగానే చిక్కులు తొలగిపోతాయి. పనులు చకచకా జరిగిపోతాయి. ఈ ఇరవై నెలల్లోనూ అందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నాడాయన.

తమాషా ఏమంటే ప్రతిపక్ష నేతలు కూడా వ్యాపార లావాదేవీలకు పెద్దగా అభ్యంతరం చెప్పరు. వారికీ ఆర్థిక కార్యకలాపాలు సాగిపోతూనే వుండాలి.వీరందరినీ అనుసంధానం చేసే ‘ఎకనామిక్‌ హిట్‌ మెన్‌’ లేదా ‘ట్రబుల్‌ షూటర్స్‌’ వేరే వుంటారు. మామూలుగా అంతగా కనిపించరు.చాపకింద నీరులా చక్కబెడుతుంటారు. పరస్పర వైరాలు వైరుధ్యాలు వస్తే సర్దుబాటు చేసి సఖ్యత పెంచడంలో ఈ సంధాన కర్తలు సమర్థులై వుంటారు.

ఇదంతా నిజమా అని మీకు సందేహం కలిగితే గత కొద్ది మాసాల పరిణామ క్రమం గుర్తు చేసుకోండి… కళ్లకు కట్టినట్టు తెలిసిపోతుంది. ఎవరు ఎప్పుడు అలిగారు, ఎవరు ఎప్పుడు దిగారు, ఎవరు ఎలా అతికించారు, ఎలా బతికించారు తెలుస్తుంది.

ఇదే మాట బాగా సీనియర్‌ అయిన ఒక మాజీ కేంద్ర మంత్రి కూడా నాతో చెప్పారు. ఎవరు ప్రభుత్వంలో వున్నా కనిపించని కార్పొరేట్‌ శక్తులే నడిపిస్తుంటాయి. నేను వుండగా లేఖలు రాశాను, మీడియాకు లీకులిచ్చాను కాని ఏం లాభం? వారు మహా శక్తివంతులు.. మనలాటి వారి ప్రయత్నాలు తేలిగ్గా అడ్డుకోగలరు అని ఆయన అన్నారు. చెప్పొచ్చిందేమంటే ప్రేమ శాశ్వతం, ప్రేమికులు మారుతుంటారు ( తరాలను, సమయాలను బట్టి) అన్నట్టే ప్రయోజనాలు శాశ్వతం, ప్రభుత్వాలు పాలక పార్టీలూ మారుతుంటాయి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close