చంద్రబాబు “బాదుడే బాదుడు” టూర్లు !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు కంటే ముందే జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బుధవారం నుంచి టూర్లు స్టార్ట్ అవుతాయి. తెలుగుదేశం పార్టీ పెరిగిన ధరలు, పెంచిన పన్నులకు వ్యతిరేకంగా “బాదుడే బాదుడు” పేరుతో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు మొదటగా జిల్లాల్లో పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 4వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది.

5 వ తేదీ భీమిలి నియోజవర్గం తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీ ముమ్మడి వరం నియోజవర్గం కోరింగ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రం లోని మూడు ప్రాంతాలలో ఈ పర్యటనలు ఉండేలా ప్రణాళిక సిద్దం చేశారు. మహానాడు వరకు పలు జిల్లాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైన తర్వాత మొదట్లో జిల్లాల పర్యటనకు వెళ్లాలనుకున్న ప్రభుత్వం వివిధ రూపాల్లో అడ్డుకుంది.

ఓ సారి విశాఖ ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించి వెనక్కి పంపారు. చాలా సార్లు ఆయన పర్యటనలకు అటంకాలు కల్పించారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా పర్యటనలు సాధ్యం కాలేదు. మహానాడులోపు మూడు ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు. మరో వైపు లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేయాలని ఇప్పటికే నిర్ణయంచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close