శ్రీలంక గుణపాఠం : గెలిపించింది..పాతరేస్తోంది ప్రజలే !

” ప్రజలు గెలిపించారు.. మాది ప్రజా ప్రభుత్వం అంటూ ఇష్టారీతిన పాలన చేసిన ప్రజల్ని పీక్కు తింటూ… అడ్డొచ్చిన వాళ్లను అడ్డగోలుగా బూతులుతో తిడతం.. లేదంటే కేసులతో లోపలేస్తాం.. మాకు ఎదురే లేదు .. మేము మగాళ్లం.. బతికున్నంత వరకూ అధికారం మాదే ” అని అధికార అహంకారంతో విర్రవీగే వారికి శ్రీలంక పరిస్థితులు.. ముందు ముందు తమకు ఎదురు కాబోయే పరిస్థితుల్ని కళ్ల ముందు కనిపించేలా చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నియంతలు.. రాజులు ఎప్పటికీ ఉండరు. ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత తమను తాము నియంతలుగా.. రాజులుగా భావిస్తే.. చివరికి ఆ ప్రజలే గోరీ కడతారు. దానికి శ్రీలంక పరిణామాలే సాక్ష్యం.

గెలిపించారని బతుకుల్ని నాశనం చేస్తే ప్రజలు ఊరుకుంటారా ?

ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న గోటబయ రాజపక్సే కానీ..రాజీనామా చేసిన మహింద రాజపక్సే కానీ ప్రజా నాయకులే. వాళ్లను ప్రజలే ఎన్నుకున్నారు. మహింద రాజపక్సే తమిళ ఈలంను అణిచి వేసి.. సింహాళుల్లో తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నారు. వారు కూడా అంతే.. తమకు తిరుగులేదని విర్రవీగారు. ప్రతిపక్షాలను అణిచివేశారు. ప్రజలని ఆకట్టుకోవడానికి ఉచితాలిచ్చారు. దేశాన్ని తాకట్టు పెట్టేశారు. చివరికి ఏమయింది..? ప్రజలు తిరగబడి.. తమ ఇళ్లనే తగలబెడుతున్నారు. కనిపిస్తే.. చేతికి దొరికితే వారినీ తగలబెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఎంత తీవ్రంగా పరిస్థితి ఎందుకు మారింది ? గెలిపించిది కూడా ప్రజలే కదా !

గెలుపోటములు ప్రజలవే… రాజకీయ నేతలు తెలుసుకోవాల్సిందిదే !

ప్రజాస్వామ్యం గెలుపు అయినా భారీ గెలుపు అయినా పరిపాలన మాత్రం ప్రజల కోణంలోనే చేయాలి. అతి భారీ గెలుపు వచ్చిందని.. యాభై శాతం మంది ఓట్లేశాని.. విచ్చలవిడితనంగా పరిపాలన చేస్తే సీన్ మారిపోతుంది. వారే తిరుగుబాటు చేస్తారు. తాము ఏం చేసినా ప్రజల మద్దతు ఉందని.. ప్రజలు గొప్ప మెజార్టీ ఇచ్చారని చెప్పుకుంటే చివరికి ఆ ప్రజలే చితిమంటలు వేస్తారని శ్రీలంక ప్రజలు నిరూపిస్తున్నారు. ఎంతటి వ్యక్తులయినా ప్రజాగ్రహానికి తల వంచక తప్పదని తేలిపోయింది.

భారత్‌లో “నయా రాజులు, నియంతలు” శ్రీలంకను చూసైనా మారతారా ?

భారత్‌లో ప్రజాస్వామ్యం.. శ్రీలంక ప్రజాస్వామ్యం కన్నా విలువల పరంగా ఎప్పుడో దిగజారిపోయింది. ఓట్లు కొనుగోలు చేసే దౌర్భాగ్యం మన దేశంలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రజలు తిరగబడక ముందే పాఠాలు నేర్చుకోవాలి. కానీ విచిత్రం ఏమిటంటే అధికారం తలకెక్కిన ఎవరికీ … తాము భవిష్యత్‌లో ఓడిపోతామని అనుకోరు. అధికారం శాశ్వతం అనుకుంటారు. ప్రజల్ని పట్టించుకోరు. ఇప్పుడు దేశంలో చాలా మంది పాలకులది అదే పరిస్థితి. శ్రీలంకను చూసి అయినా మార్చుకోవాలి.. లేకపోతే. .అలాంటి పరిస్థితులే ఇక్కడ కనిపించినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close