“నేషనల్ మీడియా”లో కేసీఆర్ ప్రకటనల హోరు !

హిందీ, ఇంగ్లిష్ మీడియాలో ఇప్పుడు తెలంగాణ సాధించిన అభివృద్ధిపై డాక్యుమెంటరీల మీద డాక్యుమెంటరీలు ప్రదర్శితమవుతున్నాయి. ఎక్కడనుంచి ప్రారంభించిది.. ఎలా ఎదిగి అనేది వివరంగా చూపిస్తున్నారు. ఇందులో ప్రతి మాటలోనూ.. ప్రతి సీన్‌లోనూ కనిపించేది కేసీఆర్ పాలనా దక్షతే. కేసీఆర్ పాలనలో తెలంగాణ అత్యంత దిగువ స్థాయి నుంచి అమెరికా స్థాయిలో ఎదిగిందని చెబుతున్నారు. కానీ దేశం అలా ఎందుకు ఎదగలేకపోయిందని ఆలోచించాలన్నట్లుగా ఆ డాక్యుమెంటరీలో ఉంటున్నాయి.

హిందీ చానళ్లలోనూ ఎయిర్ టైమ్ కొని మరీ వీటిని ప్రసారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ పబ్లిసిటీ సాగుతూడటంతో నార్త్‌లోనూ చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ ప్రగతి గురించి కేసీఆర్ ఉత్తరాదిలో చెప్పాల్సిన అవసరం ఏమిటనేది ఆ చర్చ. దానికి కారణం కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజకీయ ప్రకటనలే అని చాలా మందికి అర్థం కావడం లేదు. తెలంగాణలో తాను ఏం చేశానో చెప్పిన తర్వాత కేసీఆర్ నార్త్ లో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల ప్లీనరీలో జాతీయ రాజకీయానికి కావాల్సినంత డబ్బులు కూడా సమీకరించానని ప్రకటించారు.

అందుకే ప్రకటనలు పెద్ద ఎత్తున ఇస్తున్నారని అంటున్నారు. అయితే ఇలాంటి ప్రచారంతోనే కేసీఆర్ ఉత్తారదికి నాయకుడిగా వెళ్లగలరా అన్నది డౌటే. ఇటీవల కేసీఆర్ చాలా రాష్ట్రాలకు వెళ్లారు. వెళ్లిన చోటల్లా.. దేశ్ కీ నేత అనే ప్రచారం చేసుకున్నారు. ఆయన ప్రయత్నం ఈ ప్రచార వ్యూహంతో అయినా ఫలిస్తుందో లేదో.. రెండు, మూడు నెలల్లో తేలిపోయే అవకాశం ఉంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close